ETV Bharat / city

ఆగస్టు 3 వరకూ వీడియో కాన్ఫరెన్స్​లో కేసుల విచారణ - date extended for high court case investigation through video conference news

కరోనా వ్యాప్తి దృష్ట్యా కేసుల విచారణలన్నీ ఆగస్టు 3 వరకూ వీడియో కాన్ఫరెన్స్​ ద్వారానే జరుగుతాయి. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్​ జనరల్​ ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని తరహా వ్యాజ్యాలను ఈ - ఫైలింగ్​ విధానంలోనే దాఖలు చేయాలని ఆర్​జీ స్పష్టం చేశారు. మరోవైపు హైకోర్టు స్టాండింగ్​ కౌన్సెళ్ల రాజీనామాలు ఆమోదిస్తూ న్యాయశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

ఆగస్టు 3 వరకూ వీడియో కాన్ఫరెన్స్​లో కేసుల విచారణ

author img

By

Published : Jul 14, 2020, 7:27 AM IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆగస్టు 3 వరకూ హైకోర్టులో కేసుల విచారణలన్నీ వీడియో కాన్ఫరెన్స్​ ద్వారానే జరుగుతాయని హైకోర్టు రిజిస్ట్రార్​ జనరల్​ భానుమతి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు నియంత్రణలో పనిచేసే ఏపీ న్యాయ సేవాధికార సంస్థ, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ , మధ్యవర్తిత్వ కేంద్రాల్లో విచారణలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయన్నారు. అన్ని తరహా వ్యాజ్యాలను... ఈ - ఫైలింగ్ విధానంలోనే దాఖలు చేయాలన్నారు.

బ్లూ జీన్స్ వీడియో కాన్ఫరెన్సింగ్ అప్లికేషన్ , హైకోర్టు ధ్రువీకరించిన మరే ఇతర అప్లికేషన్ ద్వారా అన్ని తరహా కేసుల్లో విచారణలు జరుగుతాయన్నారు. ఇంటివద్ద నుంచే విచారణలు కొనసాగించాలని హైకోర్టు న్యాయమూర్తులు భావిస్తే.... ఆ విధానాన్నే అనుసరించొచ్చన్నారు. జూన్ 24 నుంచి దాఖలైన వ్యాజ్యాలను వరుస క్రమంలో విచారణకు తీసుకుంటారని వెల్లడించారు. అత్యవసర కేసుల్లో దరఖాస్తు చేసుకుంటే హైకోర్టు సీజే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

దిగువ న్యాయస్థానాల్లోనూ

  • దిగువ కోర్టుల్లోనూ అన్ని తరహా కేసుల్ని ఈ - ఫైలింగ్​ విధానంలోనే దాఖలు చేయాలి.
  • న్యాయాధికారి తన అధికారిక నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా విచారణ జరుపుతారు.
  • ఆగస్టు 3 వరకు రోజూవారీ కేసుల జాబితాలో ఉన్న వ్యాజ్యాలన్నింటినీ నెల రోజులు వాయిదా వేయాలి. విచారణ ఖైదీల కేసుల విషయంలో ఈ నిబంధన వర్తించదు.

స్టాండింగ్​ కౌన్సెళ్ల రాజీనామాలు ఆమోదం

హైకోర్టులో పనిచేసే ముగ్గురు స్టాండింగ్​ కౌన్సెళ్ల రాజీనామాలను ఆమోదిస్తూ న్యాయశాఖ కార్యదర్శి జి.మనోహర్​రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజీనామా చేసిన వారిలో శీలం శివకుమారి, కె.నర్సిరెడ్డి, జె.సుమతి ఉన్నారు. వీరు ఇటీవల ప్రభుత్వ న్యాయవాదులుగా నియమితులయ్యారు.

ఇదీ చూడండి..

రాష్ట్రంలో కొత్తగా 1,935 కరోనా కేసులు, 37 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.