విశాఖలోని గీతం వర్సిటీకి చెందిన కట్టడాల కూల్చివేత విషయంలో సింగిల్ జడ్జి ఉత్తర్వులపై.. విద్యాసంస్థ ధర్మాసనం ముందు దాఖలు చేసిన అప్పీల్‌ను తిరస్కరించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఏమైనా విజ్ఞప్తులు ఉంటే సింగిల్ జడ్జి వద్దకే వెళ్లాలని ధర్మాసనం సూచించింది. తమ స్వాధీనంలోని క్యాంపస్‌ను పరిరక్షిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని గత విచారణలో పిటిషనర్ అభ్యర్థించారు. కూల్చివేతకు ముందున్న స్థితిని కొనసాగించాలని ధర్మాసనాన్ని కోరారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా కూల్చివేత ప్రక్రియ చేపట్టారని గీతం తరపు న్యాయవాది రుద్రప్రసాద్ వాదనలు వినిపించారు.
తమనుంచి ఎలాంటి వివరణ తీసుకోలేదని గీతం తరఫు న్యాయవాది చెప్పారు. తమ స్వాధీనంలోని భూమికి మార్కెట్ ధర చెల్లించేందుకు అంగీకరించామన్నారు. కూల్చివేతల పేరుచెప్పి మిగిలిన భూమిని స్వాధీనం చేసుకునే అవకాశం ఉందన్నారు. మూడో వ్యక్తికి ఆ భూమిపై హక్కులు కల్పిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. కూల్చివేతలకు ముందున్న స్థితిని కొనసాగించేలా ఆదేశించాలని గత విచారణలో ధర్మాసనాన్ని అభ్యర్థించారు. మరోవైపు అప్పీల్‌కు విచారణార్హత లేదని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు. ఈ అప్పీల్ నేడు మరోసారి విచారణకు రాగా.. తాము సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోబోమని ధర్మాసనం తెలిపింది.
ఇదీ చదవండీ... రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ప్రభుత్వం సహకరించాలి: హైకోర్టు