ETV Bharat / city

'గండికోట నిర్వాసితుల పరిహారంపై కౌంటర్ అఫిడవిట్ వేయండి' - ఏపీ హైకోర్టు తాజా వార్తలు

గండికోట నిర్వాసితుల పరిహారంపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. గండికోట నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలంటూ హైకోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి. నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించగా.. ప్రభుత్వం గతంలోనే వారికి పరిహారం ఇచ్చిందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. పిటిషన్‌లకు సంబంధించి కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం.. తదుపరి విచారణను అక్టోబర్ 7 వ తేదీకి వాయిదా వేసింది.

ap high court
ap high court
author img

By

Published : Sep 28, 2020, 12:47 PM IST

Updated : Sep 29, 2020, 2:10 AM IST

కడప జిల్లా గండికోట జలాశయం ముంపు బాధితుల పరిహారం చెల్లింపు వివరాలు, ప్రజాహిత వ్యాజ్యంపై అభ్యంతరాలేమిటో తెలియజేస్తూ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వ్యాజ్యాలపై తదుపరి విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. గండికోట జలాశయం ముంపు బాధితుల పరిహారంపై పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్​పై ఆయన తరపు న్యాయవాది చల్లా అజయ్ కుమార్ హైకోర్టులో వాదనలు వినిపించారు. జలాశయం నీటి నిల్వ వల్ల పలుగ్రామాలు మునిగిపోతున్నాయని, గ్రామాల్ని ఖాళీ చేయించాలన్న ఉద్దేశంతో నీటి నిల్వ పెంచుతున్నారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇప్పటి వరకూ బాధితులకు పరిహారం చెల్లించలేదన్నారు.

ప్రచురణ ఉద్దేశంతో వ్యాజ్యాలు

వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ .. పలు ప్రజాహిత వ్యాజ్యాలు ప్రచురణ ఉద్దేశంతో హైకోర్టులో దాఖలవుతున్నట్లు తమ దృష్టిలో ఉందని తెలిపింది. ప్రస్తుత వ్యాజ్యంలో ఉన్న అంశాలు పత్రికల్లో యథాతథంగా ప్రచురించారని గుర్తుచేసింది. ఈ తరహా ప్రజాహిత వ్యాజ్యాలను అనుమతించేది లేదని స్పష్టంచేసింది. మీడియా నిర్ణయిస్తుందనుకుంటే అక్కడికే వెళ్లాలని సూచించింది. హైకోర్టును ఎందుకు ఆశ్రయించారని ప్రశ్నించింది. ఈ వ్యాజ్యాలపై గతంలో విచారణ జరిపి ... కేవలం వాయిదా వేశామని గుర్తుచేసింది. మరుసటి రోజు మాత్రం మొత్తం వాదనలు, పిటిషన్​లోని పూర్తి వివరాల్ని ప్రచురించారని తెలిపింది. ఈ విధానాన్ని అనుమతించబోమని కోర్టు స్పష్టంచేసింది. ప్రచారం కోసం పిల్ దాఖలు చేస్తే నిరత్సాహపరుస్తామని స్పష్టంచేసింది.

2011లోనే పరిహారం చెల్లింపు

90 శాతం ప్రజాహిత వ్యాజ్యాలు ప్రచారం కోసం వేస్తున్నారని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. కోర్టులో వ్యాజ్యం దాఖలు చేయకముందే మీడియాకు లీక్ చేస్తున్నారన్నారు. ముంపు బాధితులకు మద్దతుగా ఓ అనుబంధ పిటిషన్ వేశామని, దానిని అనుమతించాలని సీనియర్ న్యాయవాది వీరారెడ్డి అభ్యర్థించారు. అదనపు నీటిని నిల్వ చేయాల్సిన అవసరం లేకపోయినా గ్రామాలను ఖాళీ చేయాలన్న ఉద్దేశంతో ఎక్కువగా నిల్వ చేస్తున్నారని, ఇళ్లు మునిగిపోతున్నాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన వాదనలు వినిపించారు. నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచకుండా అధికారుల్ని నిలువరించాలని కోరారు. ధర్మాసనం అందుకు ఆసక్తి చూపలేదు. పూర్తిస్థాయి పరిహారం పొందినా ఆ ప్రాంతాన్ని విడిచివెళ్లడంలేదనే మరో వాదన వినపడుతోందని కోర్టు గుర్తుచేసింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్ మోహన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. 2011లోనే పరిహారం చెల్లించారన్నారు. అక్కడి ప్రజల సమ్మతితోనే భూసేకరణ ప్రక్రియ జరిగిందన్నారు.

ఇదీ చదవండి

ఈ పాట.. గండికోట నిర్వాసితుల ఆవేదన

Last Updated : Sep 29, 2020, 2:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.