ETV Bharat / city

గ్రూప్-1 వివాదంపై రెండు నెలల్లో తేల్చండి: హైకోర్టు

గ్రూప్-1 వివాదంపై లోతైన విచారణ జరిపి రెండు నెలల్లో తేల్చాలని హైకోర్టు సింగిల్ జడ్జిని ధర్మాసనం కోరింది. సింగిల్ జడ్జి తీర్పునకు గ్రూప్-1 వ్యవహారం లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. ఆ మేరకు సీజే జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది.

హైకోర్టు
హైకోర్టు
author img

By

Published : Jul 18, 2020, 8:22 AM IST

గ్రూప్ -1 ప్రాథమిక పరీక్షలో తప్పులు దొర్లాయన్న అంశంపై 2 నెలల్లో విచారణ జరిపి తేల్చాలని హైకోర్టు సింగిల్ జడ్జిని ధర్మాసనం కోరింది. ప్రాథమిక పరీక్షలో 51 ప్రశ్నల తప్పులు దొర్లాయని ,పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలంటూ దాఖలైన వ్యాజ్యపై లోతైన విచారణ జరపాలని సింగిల్ జడ్జి ఇచ్చే తీర్పునకు గ్రూప్-1 వ్యవహారం లోబడి ఉంటుందని స్పష్టం చేసింది.

2018 డిసెంబర్లో 169 గ్రూప్ -1 పోస్టుల భర్తీ నిమిత్తం ఏపీపీఎస్సీ ప్రకటన జారీచేసింది. ప్రాథమిక పరీక్ష తెలుగు అనువాదంలో 51 తప్పులు దొర్లాయని పేర్కొంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కోరారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి... ప్రాథమిక పరీక్ష ఫలితాల వెల్లడిపై మొదట్లో స్టే విధించారు. ఏపీపీఎస్సీ అభ్యర్థన మేరకు ఆ తర్వాత స్టే ఎత్తివేయటంతో ప్రాథమిక ఫలితాలు వెలువడ్డాయి. ప్రాథమిక పరీక్ష ఫలితాల వెల్లడికి అవకాశమిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై అభ్యర్థులు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. మొత్తం 120 ప్రశ్నల్లో 51 తప్పులుంటే పరీక్ష రద్దు చేసి మళ్లీ ఎందుకు నిర్వహించకూడదని గతంలో కోర్టు వ్యాఖ్యానించింది . శుక్రవారం ధర్మాసనం అప్పీల్ పై మరోసారి విచారణ జరిపింది. వ్యవహారాన్ని తిరిగి సింగిల్ జడ్జి వద్దకు పంపుతూ వ్యాజ్యాన్ని రెండు నెలల్లో తేల్చాలని సూచించింది

ఇదీ చదవండి : 'వారిని అరెస్టు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.