ఈ నెలాఖరులోగా విద్యుదుత్పత్తి కంపెనీలకు బిల్లులు చెల్లించాలని హైకోర్టు (AP high court) ఆదేశించింది. విద్యుదుత్పత్తి కంపెనీలకు బిల్లుల చెల్లింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఏడాదిగా బిల్లులు చెల్లించలేదని విద్యుదుత్పత్తి కంపెనీలు హైకోర్టును ఆశ్రయించాయి. బకాయిలు చెల్లించాలని గతంలోనే హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. అయితే అందుకు సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ ఇవాళ హైకోర్టు చీఫ్ జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, నయనాల జయసూర్య బెంచ్ ముందుకు వచ్చింది. బిల్లులు చెల్లించాలని చెప్పినా ఎందుకు ఇవ్వలేదని అడ్వకేట్ జనరల్‌ను హైకోర్టు ప్రశ్నించింది. రుణాల కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అడ్వకేట్ జనరల్ సమాధానమిచ్చారు. నిధులు సమకూరగానే చెల్లిస్తారని తెలిపారు.
ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవటంతో విద్యుత్ కంపెనీలు తమ ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి ఏర్పడిందని వారి తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. ఈ నెలాఖరులోగా బిల్లులు చెల్లించాలని హైకోర్టు బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చదవండి: