ETV Bharat / city

YS Viveka Murder Case: 'సాక్షులను బెదిరిస్తున్నారు.. వారికి బెయిల్​ ఇవ్వొద్దు..'

author img

By

Published : May 5, 2022, 7:21 AM IST

HC On Viveka murder case Accused Bail Petition: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితులకు బెయిల్‌ మంజూరు చేయొద్దని ఆయన కుమార్తె సునీత తరఫు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. జైల్లో ఉంటూనే దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి.. సాక్షుల్ని బెదిరించడంతోపాటు దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారని పేర్కొన్నారు. మొదటి అభియోగపత్రంలోని వివరాలతో పోలిస్తే.. రెండోదానిలో శివశంకర్‌రెడ్డి పాత్రపై పురోగతి ఉందన్నారు. సాక్షుల బెదిరింపులకు పాల్పడుతున్న శివశంకర్‌రెడ్డితోపాటు ఇతర నిందితులైన సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డికి బెయిల్‌ నిరాకరించాలని కోరారు.

ap high court On Viveka murder
ap high court On Viveka murder

YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో బైయిల్‌ కోరుతూ నిందితులు సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. న్యాయవాది గూడపాటి వెంకటేశ్వరరావు.. వివేకా కుమార్తె సునీత తరఫున వాదనలు వినిపించారు. బెదిరింపులకు పాల్పడేవారు.. బెయిల్‌ పొందడానికి అనర్హులని అన్నారు. జైల్లో ఉంటూనే నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి.. సాక్షులను బెదిరించడంతోపాటు దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారని చెప్పారు. అప్రూవర్‌గా మారిన దస్తగిరి.. ఇతర నిందితుల నుంచి ప్రాణహాని ఉందని చెబుతున్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గతంలో నిందితులు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లపై హైకోర్టు సింగిల్ జడ్జి విచారణ జరిపి వాటిని కొట్టేశారని గుర్తుచేశారు.

ప్రస్తుత వ్యాజ్యాలు అక్కడికే విచారణకు వెళ్లాలన్నారు. సుప్రీంకోర్టు తాజాగా ఈ వ్యవహారమై ఓ తీర్పు ఇచ్చిందని చెప్పారు. సుప్రీంకోర్టు, ఇతర హైకోర్టులు ఇచ్చిన తీర్పు ప్రతులను విచారణకు స్వీకరించాలని కోరారు. ప్రస్తుత పిటిషన్‌లో ప్రతివాదిగా చేరి.. వాదనలు వినిపించేందుకు మృతుడి కుమార్తె సునీతకు అర్హత ఉందన్నారు. ఇంప్లీడ్ పిటిషన్‌ను అనుమతించాలని కోరారు. అందుకు అంగీకరించిన న్యాయమూర్తి ఇంప్లీడ్‌ పిటిషన్‌ను అనుమతించారు. ప్రధాన బెయిల్‌ పిటిషన్లలో కౌంటర్ వేసేందుకు.. సునీతకు వెసులుబాటు ఇచ్చారు. సీబీఐతోపాటు సునీత తరఫు న్యాయవాది వాదనల కొనసాగింపునకు విచారణను ఈ నెల 6కి వాయిదా వేశారు.

నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిపై మొత్తం 31 కేసులు ఉన్నాయని సీబీఐ తరఫు న్యాయవాది చెన్నకేశవులు వాదనలు వినిపించారు. ఆయన అమాయకుడు కాదని నేరచరిత్ర ఉందన్నారు. అరెస్టయిన దగ్గర్నుంచీ.. దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. సాక్షుల్ని బెదిరిస్తున్నారన్నారు. కడప కేంద్ర కారాగారం సూపరింటెండెంట్.. మెజిస్ట్రేట్ అనుమతి తీసుకోకుండా శివశంకర్‌రెడ్డిని ఆసుపత్రికి తరలించారని పేర్కొన్నారు. ఈ వ్యవహారమై సూపరింటెండెంట్‌కు షోకాజ్ నోటీసు జారీ అయ్యిందని తెలిపారు. వివేకా హత్య కుట్రలో ఇతర నిందితులతో పాటు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి పాత్ర ఉందన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని.. ఇలాంటి సమయంలో నిందితులకు బెయిల్‌ ఇస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారన్నారు. గతంలో నిందితులకు బెయిల్ తిరస్కరించిన హైకోర్టు జడ్జి వద్దకే.. ప్రస్తుత బెయిల్ పిటిషన్లూ విచారణకు వెళ్లాల్సి ఉందన్నారు. మృతుడి కుమార్తెగా సునీత.. ఈ వ్యవహారంపై లేవనెత్తిన అభ్యంతరాన్ని పరిష్కరించాక విచారణలోకి వెళ్లాలన్నారు.

వివేకా హత్య కేసులో 247 మంది సాక్షుల్ని విచారించారని నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తరఫు న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఎలాంటి షరతులైనా విధించి బెయిల్ మంజూరు చేయాలని కోరారు. గతంలో బెయిల్‌ పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు జడ్జి వద్దకే ప్రస్తుత వ్యాజ్యాలు విచారణకు వెళ్లాలనే ఫిర్యాదిదారు సునీత, సీబీఐ వాదన సరికాదన్నారు. ఫిర్యాదిదారు సునీత చెప్పినట్లు సీబీఐ వ్యవహరిస్తోంది తప్పా.. స్వతంత్రంగా వ్యవహరించడం లేదని ఆరోపించారు. ప్రస్తుత వ్యాజ్యాలు.. మొదట ఓ న్యాయమూర్తి వద్దకు విచారణకు వస్తే అప్పుడెందుకు అభ్యంతరం తెలపలేదన్నారు. బెంచ్‌ కేటాయింపుపై అభ్యంతరం ఉంటే ఆ విషయాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లాలని తప్పా.. నేరుగా కోర్టులో అభ్యంతరం చెప్పడానికి వీల్లేదన్నారు. ఫిర్యాదిదారు సునీత వాదనలు వింటుంటే విచారణ నుంచి న్యాయమూర్తి వైదొలగాలని కోరినట్లు ఉందన్నారు. ఈ తీరు ఫోరం షాపింగ్ అవుతుందని వ్యాఖ్యానించారు.

వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాది గూడపాటి వెంకటేశ్వరరావు.. నిరంజన్‌రెడ్డి వాదనపై అభ్యంతరం తెలిపారు. న్యాయమూర్తి వైదొలగాలని తాము కోరడం లేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రస్తుత వ్యాజ్యాలు గతంలో బెయిల్‌ పిటిషన్లను కొట్టేసిన న్యాయమూర్తి వద్దకు విచారణకు వెళ్లాల్సి ఉందని చెప్పారు. గతంలో బెయిల్‌ పిటిషన్లను విచారించిన న్యాయమూర్తికి కేసు పూర్వాపరాలు తెలుసు కాబట్టి తదనంతరం దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లూ అక్కడికే వెళ్లడం సరైన విధానమని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తుచేశారు. ప్రస్తుత బెంచ్ వద్ద విచారణపై తాము లేవనెత్తిన అభ్యంతరంపై నిర్ణయం తీసుకునే విచక్షణాధికారం.. కోర్టుదేనన్నారు.

వివేకా హత్య వెనుక.. నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి పాత్ర ఉందని సీబీఐ గుర్తించిందని కోర్టుకు తెలిపారు. మొదటి ఛార్జిషీట్‌కు, రెండో ఛార్జిషీట్‌కు మధ్య వ్యత్యాసం గమనిస్తే శివశంకర్‌రెడ్డి పాత్ర పెరిగిందన్నారు. హత్య అనంతరం సాక్ష్యాధారాలను చెరిపేయడంలో శివశంకర్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. సీబీఐ దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నందున నిందితులకు బెయిల్‌ ఇవ్వొద్దని కోరారు. ఈ కేసు విచారణ బాధ్యతను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తనకు అప్పగించిన నేపథ్యంలో విచారిస్తున్నానని న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్‌ చెప్పారు. ఫలానా కోర్టుకు ఈ వ్యాజ్యాలు విచారణకు వెళ్లాలని ఫిర్యాదిదారు, సీబీఐ భావిస్తే ఆ విషయాన్ని ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లాలని.. తనకు అభ్యంతరం లేదని తెలిపారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.