న్యాయవ్యవస్థపైన సామాజిక మాధ్యమాల్లో అభ్యంతకర పోస్టింగులు పెట్టి, చర్చలు జరిపిన 93 మందిపై సుమోటోగా నమోదు చేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై... గురువారం హైకోర్టు విచారణ జరిపింది. కొంతమంది కౌంటరు దాఖలు చేయడానికి చివరి అవకాశంగా 30 రోజుల గడువిచ్చింది. ఆ లోపు కౌంటరు వేయకపోతే దాఖలు చేయడానికి ఆసక్తి లేనివారిగా భావించి విచారణ కొనసాగిస్తామని తేల్చి చెప్పింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జెేకే మహేశ్వరి, జస్టిస్ కె. లలితతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
వైకాపా ఎంపీ నందిగం సురేశ్, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, వైకాపా ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్‌రెడ్డి, పలువురు న్యాయవాదులు, జర్నలిస్టులు, తదితరులు కోర్టుధిక్కరణ జాబితాలో ఉన్నారు.
ఇదీ చదవండి
న్యాయవ్యవస్థను బెదిరించేందుకే జగన్ లేఖ: సుప్రీం న్యాయవాది అశ్వినీకుమార్ ఉపాధ్యాయ