ETV Bharat / city

ఇది పూర్తిగా కార్మిక వివాద వ్యవహారం.. జోక్యం చేసుకోలేం: హైకోర్టు - ఏపీ హైకోర్టు తాజా వార్తలు

మున్సిపల్ కార్పోరేషన్లలో పొరుగుసేవల పద్ధతిలో పనిచేసే పారి శుద్ధ్య కార్మికులకు పనికి తగ్గ సమాన వేతనం కల్పించేలా ఆదేశించాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. ఈ విషయంలో వ్యాజ్యం దాఖలు చేయడం సరికాదని తెలిపింది.

ap high court
ap high court
author img

By

Published : Jan 8, 2021, 7:13 AM IST

పొరుగుసేవల పద్ధతిలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు పనికి తగ్గ సమాన వేతనం కల్పించేలా ఆదేశించాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారం పూర్తిగా కార్మిక వివాద వ్యవహారమని పేర్కొంది. ఈ విషయంలో పిల్ దాఖలు చేయడం సరికాదని తెలిపింది. కార్మిక సంఘాలు, కార్మికులు వేతనాల విషయంలో సంబంధిత అధికారులను, ఫోరంలను ఆశ్రయించేందుకు స్వేచ్ఛనిచ్చింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ , జస్టిస్ ఏవీ శేషసాయితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. మున్సిపల్ కార్పొరేషన్లలో పనిచేసే ఔట్ సోర్సింగ్ కార్మికులకు, శాశ్వత ఉద్యోగుల మాదిరి పనికి తగ్గ వేతనం ఇచ్చేలా ఆదేశించాలని కోరుతూ.. జనసేన నాయకుడు , సామాజిక ఉద్యమకారుడు డి.మహేశ్ హైకోర్టులో పిల్ వేశారు.

ఇదీ చదవండి: ప్రభుత్వమే లే అవుట్లను అభివృద్ధి చేసి ఇవ్వాలి: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.