ETV Bharat / city

సీఎం జగన్‌పై కేసుల ఉపసంహరణ.. సుమోటోగా తీసుకుని హైకోర్టు విచారణ - సీఎం జగన్ అక్రమాస్తులు న్యూస్

ముఖ్యమంత్రి జగన్‌(cm jagan)పై గతంలో నమోదైన 11 కేసుల్లో ప్రాసిక్యూషన్‌ ఉపసంహరణను హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ జరిపింది. తుది నివేదికలను మెజిస్ట్రేట్లు అనాలోచితంగా అంగీకరించి.. కేసుల్ని హడావుడిగా మూసేశారని వెల్లడించింది. న్యాయ విచక్షణను వర్తింప చేయకుండా.. తుది నివేదికలను అంగీకరించారని వ్యాఖ్యానించింది.

ap high court on cm jagan cases
ap high court on cm jagan cases
author img

By

Published : Jun 24, 2021, 4:31 AM IST

ప్రజాప్రతినిధులపై కేసుల విచారణను వేగవంతం చేయాలంటూ సుప్రీంకోర్టు(supreme court) ఆదేశాలిచ్చిన కొద్దికాలానికే 2016లో జగన్‌మోహన్‌రెడ్డిపై నమోదైన కేసుల్లో పోలీసులు తక్కువ వ్యవధిలోనే 11 కేసుల్లో తుది నివేదికలను (ఫైనల్‌ రిపోర్ట్‌) దాఖలు చేశారని హైకోర్టు(high court) సుమోటోగా నమోదుచేసిన పిటిషన్లలో పేర్కొంది. తుది నివేదికలను మేజిస్ట్రేట్లు అనాలోచితంగా అంగీకరించి, కేసుల్ని హడావుడిగా మూసేశారని వెల్లడించింది.

మేజిస్ట్రేట్లు ఫిర్యాదుదారుల నుంచి అఫిడవిట్లు తీసుకోలేదని, కేసుల మూసివేతకు కారణాలు పేర్కొనలేదని తెలిపింది. న్యాయవిచక్షణను వర్తింపజేయకుండా తుది నివేదికలను అంగీకరించారంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, సంబంధిత స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్లు, ఫిర్యాదుదారులు, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, సాక్షి దినపత్రిక, సాక్షి న్యూస్‌ఛానల్‌ ఎడిటర్లను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొంది.

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు గుంటూరు, అనంతపురం జిల్లాల్లో 2016లో 11 క్రిమినల్‌ కేసులు(criminal cases) నమోదయ్యాయి. దిగువ న్యాయస్థానాల్లోని ఆ కేసులను పోలీసులు, ఫిర్యాదుదారులు, సంబంధిత న్యాయాధికారులు నిబంధనలకు విరుద్ధంగా హడావుడిగా ఉపసంహరించారని హైకోర్టు పరిపాలన విభాగం సుమోటోగా క్రిమినల్‌ రివిజన్‌ పిటిషన్లు నమోదు చేయాలని పేర్కొంది. సామరస్యపూర్వకమైన వాతావరణాన్ని దెబ్బతీసేలా జగన్‌మోహన్‌రెడ్డిపై కొన్ని కేసులు ఉన్నాయంది.
ప్రజాప్రతినిధులపై కేసుల్ని వేగవంతం చేయాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం 2020 సెప్టెంబరు 16, 17 తేదీల్లో ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. జగన్‌మోహన్‌రెడ్డిపై 2016లో నమోదైన 11 కేసుల్లో పోలీసులు తుది నివేదికలు వేసి.. 2020 సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 22 మధ్య హడావుడిగా ఉపసంహరించుకున్నారు.

మొదట నోటీసులు ఇద్దాం
సుమోటోగా నమోదు చేసిన కేసుల్లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లలిత బుధవారం విచారణ జరిపారు. అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. ‘ఈ కేసుల పూర్తి వివరాలు మా వద్ద లేవు. హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్‌ కమిటీ రిపోర్టు ఆధారంగా సుమోటో కేసులు నమోదు చేసినట్లు రిజిస్ట్రీ వర్గాల ద్వారా తెలిసింది’ అన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ఈ వ్యాజ్యాల్లో ప్రతివాదులుగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డితో పాటు మిగిలిన వారికి మొదట నోటీసులు జారీచేస్తామని, తర్వాత విచారణ చేద్దామని అన్నారు. నోటీసుల జారీ విషయంలో తమ వాదనలు విన్న తర్వాత నిర్ణయం తీసుకోవాలని ఏజీ కోరారు.

‘దిగువ కోర్టు విచారణ ప్రక్రియలో చోటు చేసుకున్న తప్పులపై.. జ్యుడిషియల్‌ అధికారాన్ని ఉపయోగించి విచారణ చేపట్టవచ్చు. ఈ వ్యవహారంతో హైకోర్టు పరిపాలనా విభాగానికి సంబంధం లేదు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి(cm jagan)పై నమోదైన కేసుల్ని గతంలో ఓ హైకోర్టు న్యాయమూర్తి తీర్పులో ప్రస్తావించారు. ఆ వివరాల్ని రిజిస్ట్రార్‌ జ్యుడిషియల్‌ హైకోర్టు పరిపాలన విభాగం వద్ద ఉంచారు. ఆ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఏ వివరాల ఆధారంగా సుమోటోగా తీసుకున్నారో ఆ వివరాల్ని మాకు అందించలేదు. సుమోటోగా నమోదుచేసిన కేసుల వ్యవహారంపై ఓ మీడియా సంస్థ 45 నిమిషాల కార్యక్రమం నిర్వహించింది. మా కంటే ముందు మీడియా(media)కే వివరాలు తెలుస్తున్నాయి. దిగువ కోర్టులపై పర్యవేక్షణ అధికారం పేరుతో నిబంధనలకు విరుద్ధంగా సుమోటోగా పిటిషన్లు నమోదు చేశారు. మేజిస్ట్రేట్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు హైకోర్టు పరిపాలనా విభాగం గుర్తిస్తే.. సుమోటోగా తీసుకునే అంశాన్ని సంబంధిత హైకోర్టు జడ్జి(high court judge) ముందు ఉంచాలి. ప్రస్తుత పిటిషన్లు నమోదు చేయడానికి గల వివరాల్ని ప్రభావిత కక్షిదారులకు అందజేయకుండా నిష్పాక్షిక విచారణ సాధ్యం కాదు. ఈ వ్యవహారానికి సంబంధించి దస్త్రాలన్నింటినీ పరిశీలించాకే నోటీసులు ఇచ్చే అంశాన్ని పరిగణనలోకి తీసుకోండి. ‘జ్యుడిషియల్‌ విధుల్లో’ భాగంగానే హైకోర్టు సుమోటోగా పిటిషన్లను నమోదు చేయగలదు. హైకోర్టు పరిపాలన కమిటీ సిఫారసు ఆధారంగా సుమోటోగా పిటిషన్లు నమోదుచేయడం సీఆర్‌పీసీ నిబంధనలకు విరుద్ధం. కేసుల ఉపసంహరణ విషయంలో పరిపాలనాపరమైన నిర్ణయం ఆధారంగా సుమోటో పిటిషన్లు నమోదు చేయడం న్యాయ చరిత్రలో ఇదే ప్రథమం. సుమోటోగా తీసుకోవడానికి పరిగణనలోకి తీసుకున్న వివరాల్ని పరిశీలించకుండా ప్రతివాదులకు నోటీసులు జారీ చేయొద్దు’ అని కోరారు. ఏజీ వాదనల అనంతరం విచారణను ఈనెల 25కు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లలిత(justice k.lalitha) ప్రకటించారు.

ఇదీ చదవండి: Jagan Review: ఐటీ కేంద్రంగా విశాఖ: ముఖ్యమంత్రి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.