ETV Bharat / city

ఎస్‌ఈసీ అప్పీల్‌పై హైకోర్టులో విచారణ.. కాసేపట్లో తీర్పు - ap sec

ఏపీ పరిషత్ ఎన్నికలు  2021
mptc and zptc elections in ap
author img

By

Published : Apr 7, 2021, 11:05 AM IST

Updated : Apr 7, 2021, 2:15 PM IST

11:01 April 07

ఎస్‌ఈసీ అప్పీల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువైపు వాదనలు విన్న కోర్టు... తీర్పును కాసేపట్లో వెలువరించనుంది.

ఎస్‌ఈసీ అప్పీల్‌పై హైకోర్టులో విచారణ కొనసాగింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు రద్దు చేయాలని కోరుతూ.. ఎస్‌ఈసీ కార్యదర్శి కన్నబాబు అప్పీల్‌ దాఖలు చేశారు. ఎస్‌ఈసీ తరఫున న్యాయవాది సి.వి. మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. 

28 రోజుల కోడ్‌ ఉండాలనే నిబంధన సుప్రీంకోర్టు ప్రత్యేక సందర్భంలో ఇచ్చిందన్నారు. కోడ్‌ నిబంధన ఈ ఎన్నికలకు వర్తింపజేయాల్సిన అవసరం లేదని ఎస్‌ఈసీ తరపు న్యాయవాది వాదించారు. హైకోర్టు సింగిల్‌ జడ్జి వద్ద ఈ వాదనలు వినిపించారా అని ఎస్​ఈసీ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే వాదనకు సమయం సరిపోలేదని ఎస్​ఈసీ న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. 

రిట్‌ పిటిషన్‌ వేసిన వర్ల రామయ్య ఎన్నికల్లో పోటీ చేయట్లేదని ఎస్‌ఈసీ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. తెదేపా తరఫున ఆయన పిటిషన్‌ వేయలేదన్నారు. వ్యక్తిగతంగా రిట్‌ పిటిషన్‌ వేయకూడదని.. పిల్‌ మాత్రమే వేయాలని ఎస్‌ఈసీ న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే పిటిషన్‌లో సరైన వివరాలు లేవని ఎస్‌ఈసీపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను హైకోర్టు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేసింది. అనంతరం ప్రతివాదుల తరపున వాదనలు విన్న న్యాయస్థానం.. విచారణను ముగించింది.  తీర్పును మధ్యాహ్నం 2.15 గంటలకు వెల్లడించనున్నట్లు తెలిపింది. 

ఇదీ చదవండి

పరిషత్‌ ఎన్నికలు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

Last Updated : Apr 7, 2021, 2:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.