లాక్ డౌన్ విధింపు నేపథ్యంలో కేంద్రప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవసాయ పనులు, రైతు ఉత్పత్తుల విక్రయాలకు ఆటంకం కలిగించకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. త్వరగా పాడైపోయే పండ్ల ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశామని మార్కెటింగ్ శాఖ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 700 కొనుగోళ్ల కేంద్రాలు ఏర్పాటు చేసి నిత్యం వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. చాలా ప్రాంతాల్లో టమాట, మామిడి పండ్లు వేల టన్నులు కొనుగోలు చేయాల్సి ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది అంబటి సుధాకరరావు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఎక్కడెక్కడ కొనుగోలు చేయలేదో పూర్తి వివరాలతో అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్‌ను న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 25కి వాయిదా వేసింది.
వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలపై హైకోర్టులో విచారణ - petition in ap highcourt on agriculture products
లాక్‌డౌన్ నేపథ్యంలో వ్యవసాయ ఉత్పత్తుల విక్రయంపై హైకోర్టులో విచారణ జరిగింది. పండ్ల విక్రయాలకు ఆటంకం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వేల టన్నుల టమాట, మామిడిపండ్లు కొనుగోలు చేయాల్సి ఉందని వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. పూర్తి వివరాలతో అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్‌ను ఆదేశించింది.