గ్రానైట్ లీజు గరిష్ఠ కాల పరిమితిని 20 ఏళ్లకు పరిమితం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ మైనింగ్ మినరల్ కన్‌సెషన్ నిబంధనను హైకోర్టు తప్పుపట్టింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రానైట్ రూల్స్ ప్రకారం, కాంపీటెంట్ అథార్టీ లీజు కాల పరిమితిని 20 నుంచి 30 ఏళ్లకు నిర్ణయించే విలుందని తెలిపింది. ఇది ఏపీ మైనింగ్ మినరల్ రూల్స్ కాంపీటెంట్ అథార్టీకి ఉన్న విచక్షణాధికారాన్ని లాగేసుకోవడమేనని పేర్కొంది. గ్రానైట్ లీజు కాలం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన గ్రానైట్ రూల్ 6కి అనుగుణంగా ఉండాలి తప్ప.. ఏపీ మైనర్ మినరల్ రూల్ 12(5)(హెచ్) ప్రకారం ఉండటానికి వీల్లేదంది.
ఇవి చదవండి:
- శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఆద్యంతం నేత్ర పర్వంగా సాగిన గరుడ వాహన సేవ
- సజ్జలపై తెలంగాణ మంత్రి గంగుల ఫైర్
- రేషన్ షాపుల్లో బియ్యం సంగతి సరే.. సరకుల్లో కోత.. ధరల పెంపు.. అవి కూడా అరకొరే