ఆనందయ్య మందు పంపిణీపై విచారణకు రాష్ట్ర హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఎల్లుండి హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ చేపట్టనుంది. ఔషధ పంపిణీ ఖర్చును ప్రభుత్వమే భరించాలని పిటిషనర్లు కోరారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూడాలని తెలిపారు. లోకాయుక్త ఆదేశంతో పంపిణీ నిలిపివేసినట్లు పోలీసులు చెబుతున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. మందు పంపిణీ అడ్డుకునే అధికారం లోకాయుక్తకు లేదన్నారు. పిటిషనర్ల వాదనలు విన్న కోర్టు.. విచారణకు అనుమతి ఇచ్చింది.
ఇదీ చదవండి