'కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు' - విజయరామరాజు లేటెస్ట్ న్యూస్
రాష్ట్రంలో తొలి కరోనా వైరస్ కేసు అధికారికంగా నమోదైందని కుటుంబ ఆరోగ్య సంక్షేమశాఖ కమిషనర్ విజయరామరాజు తెలిపారు. ఇటలీ నుంచి వచ్చిన నెల్లూరు విద్యార్ధికి కరోనా వైరస్ సోకినట్లు పుణే ఎన్ఏవీ నిర్ధారించిందన్నారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వారి విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఈటీవీ భారత్తో ముఖాముఖిలో విజయరామరాజు తెలిపారు.
'కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు'