బియ్యం కార్డులను ఆదాయ ధ్రువీకరణ పత్రాలుగా గుర్తించాలని ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు తెలిపింది. సంక్షేమ పథకాల్లో అర్హత పొందేందుకు ఆదాయ ధ్రువీకరణ పత్రాలుగా బియ్యం కార్డులనే పరిగణించాలని పేర్కొంది. బియ్యం కార్డులను ఆదాయ ధ్రువీకరణ పత్రాలుగా పరిగణించాలని రెవెన్యూశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బీపీఎల్ స్థాయి దాటిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు 4 ఏళ్లపాటు చెల్లుబాటు కానుంది. ఇతరులకు జారీచేసే ఆదాయ ధ్రువీకరణ పత్రం 4 ఏళ్ల పాటు చెల్లుబాటు అవుతుంది. రైతులకు రుణ మంజూరులోనూ బ్యాంకులు బియ్యం కార్డునే గుర్తించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇదీ చదవండి: శిరోముండనం చేసిన యువకుడిని.. ఆ రోజు రాత్రి ఇలా కొట్టారా?