కరోనా వ్యాప్తిని వైద్యపరంగా మరింత దీటుగా ఎదుర్కొనేందుకు.... రాష్ట్రవ్యాప్తంగా వైద్య నిపుణులు, పారామెడికల్, వైద్య వాలంటీర్ల నియామకం కోసం ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఆసక్తి చూపే వాలంటీర్లకు ఇంటివద్దే శిక్షణ ఇచ్చేందుకు 'ఐగాట్' అనే ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించింది. కరోనా చికిత్స అందించే చోట అందించాల్సిన సేవలు, జాగ్రత్తలు తదితర అంశాలపై ప్రాథమిక స్థాయిలో శిక్షణ అందించనున్నారు. ఈ కార్యక్రమానికి 'దీక్ష' అని పేరు పెట్టింది. దీంతో పాటు ఇతర కోర్సుల విషయంలోనూ విద్యార్థులు, యువత వెనుకబడకుండా ఉండేందుకుగానూ వివిధ కోర్సులను ఆన్‌లైన్‌లోనే నేర్చుకునేలా ప్రైవేట్ ఆపరేటర్లను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. నైపుణ్యాభివృద్ధి శాఖ వెబ్‌సైట్ ద్వారా ఈ వివరాలను తెలుసుకుని ఆన్‌లైన్ కోర్సులను ఉచితంగా వినియోగించుకోవచ్చని తెలిపింది.
ఇదీ చదవండి: