బీసీ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు అందించే ఆర్థిక సాయం పథకం 'వైఎస్ఆర్ చేయూత'పై స్పష్టతను ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లబ్ధిదారులకు సంబంధించిన అర్హత, వయసు తదితర అంశాలపై నియమ నిబంధనలను విడుదల చేసింది.
45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయస్సులోపు ఉన్న బీసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు 75,000 రూపాయల ఆర్థిక సహాయం కోసం వైఎస్సార్ చేయూత పథకం అమలు అవుతోందని.. ఏడాదికి 18750 రూపాయల చొప్పున నాలుగేళ్లలో చెల్లించేందుకు గతంలోనే ఉత్తర్వులు జారీ చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది. అయితే ప్రతి ఏడాది ఆగస్టు 12 నాటికీ 45 ఏళ్లు నిండిన అర్హులకే ఈ పథకం వర్తిస్తుందని స్పష్టం చేసింది. అదే తేదీ నాటికి 60 ఏళ్లకు పైబడిన వారికి ఈ పథకం వర్తించదని ప్రభుత్వం వెల్లడించింది. వారి పేర్లు లబ్ధిదారుల జాబితా నుంచి తొలగుతాయని స్పష్టం చేసింది. 60 ఏళ్లకు పైబడిన వారికి వైఎస్ఆర్ పెన్షన్ కానుక అందుతుందని ఉత్తర్వుల్లో వివరించింది.
ఇదీ చదవండి