మగ్గం నేసే చేనేత కార్మిక కుటుంబాలకు అందించే ఆర్థిక సాయంపై రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది. ఏడాదికి 24 వేల రూపాయలు చేనేత కార్మికుల కుటుంబాలకు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం... పథకం అమలుకు స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. 'వైఎస్ఆర్ నేతన్న నేస్తం' పేరిట ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆధునిక మగ్గం పరికరాల కొనుగోలు, పవర్ లూమ్స్‌కు పోటీగా చేనేత కార్మికులకు ఈ ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబరు 2019 నుంచి ఈ పథకం వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
'డిసెంబర్ నుంచి వైఎస్‌ఆర్ నేతన్న నేస్తం అమలు' - వైఎస్ఆర్ నేతన్న నేస్తం వార్తలు
చేనేత కార్మిక కుటుంబాలకు అందించే ఆర్థిక సాయంపై రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 'వైఎస్ఆర్ నేతన్న నేస్తం' పేరిట ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించింది.