శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నిబంధనల్ని ఏకపక్షంగా ఉల్లంఘిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి జరిమానా వేయాలని.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(krmb)కు.. ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు లేఖ(letter) రాశారు. విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా ఏ రాష్ట్రమైనా చట్ట నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధించే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి కారణంగా విలువైన నీరు వృథా అవుతోందని కేఆర్ఎంబీకి రాసిన లేఖలో ఆయన వివరించారు. సెప్టెంబర్ 1వతేదీన జలసౌధలో జరిగిన 14 బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను, ఒప్పందాలను తెలంగాణ ఉల్లంఘిస్తోందని స్పష్టం చేశారు. విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ వాడుకున్న 113 టీఎంసీల నీటిని ఆ రాష్ట్ర వాటాలో వేయాలని ఫిర్యాదులో తెలిపారు. తక్షణం నీటి వినియోగాన్ని నిరోధించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యుత్ ఉత్పత్తి కోసం శ్రీశైలం రిజర్వాయర్ను ఖాళీ చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజీల దిగువన సాగునీటి అవసరాలేమీ లేవని ఏపీ స్పష్టం చేసింది.
ఇదీ చదవండీ.. junior civil judge case: బీసీలకు 60శాతం మార్కుల నిబంధన వర్తించదు..