రాష్ట్రంలోని పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం అమలుపై... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1 నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నట్లు జీవోలో పేర్కొంది. వచ్చే విద్యా సంవత్సరం అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. తదుపరి ఏడాది నుంచి ఒక్కో తరగతిలో ఆంగ్లమాధ్యమాన్ని పెంచుతామని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
ఆంగ్లమాధ్యమంపై ఉపాధ్యాయులకు శిక్షణ, హ్యాండ్ బుక్స్ బాధ్యతను స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (ఎస్సీఈఆర్టీ)కి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో చేపట్టే ఉపాధ్యాయ నియామకాల్లో ఆంగ్లంలో ప్రావీణ్యం ఉన్నవారికే... ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.