విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ ప్రతిపాదనను విరమించుకోవాలంటూ ఆందోళన చేస్తున్న విద్యుత్ ఉద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. అమరావతిలోని సచివాలయంలో విద్యుత్ ఉద్యోగ సంఘాలతో ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి బుధవారం భేటీ అయ్యారు. 14 అంశాలను విద్యుత్ ఉద్యోగుల సంఘాల జేఏసీ ప్రభుత్వం ముందు ఉంచింది.
డిమాండ్లు ఇవే...
ఏపీ ట్రాన్స్ కో, డిస్కమ్‌లలో ప్రైవేటీకరణ ప్రతిపాదనలు ఉపసంహరించుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్రం ప్రతిపాదిస్తున్న ప్రైవేటీకరణ చేయబోమంటూ తెలంగాణ ప్రభుత్వం తరహాలోనే అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని పాదయాత్రలో ఇచ్చిన హామీని అమలు చేయాలని విద్యుత్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. వీటీపీఎస్, రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్లలో ఉత్పత్తి నిలిపివేసి బయట నుంచి కొనుగోళ్లు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లను పరిష్కరించకపోతే నవంబరు 16 తర్వాత సమ్మెకు వెళ్తామని విద్యుత్ ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి.
ఇదీ చదవండి