ETV Bharat / city

'సీమ ఎత్తిపోతలపై కేంద్రమంత్రికి లేఖ రాయండి' - ap go no 203 news

రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు లేఖ రాయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

cm jagan
cm jagan
author img

By

Published : Jun 9, 2020, 4:51 AM IST

రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు లేఖ రాయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు లేఖ రాయాలని జలవనరుల శాఖ అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. కృష్ణా, గోదావరి నదులు యాజమాన్య బోర్డుల సమావేశాల్ని... వారం రోజుల కిందట హైదరాబాద్‌లో నిర్వహించారు. భేటీలో చర్చించిన అంశాలు, అక్కడి పరిణామాలను జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌, ఈఎన్‌సీ నారాయణరెడ్డి ముఖ్యమంత్రికి వివరించారు.

కృష్ణా ఎగువన ఆలమట్టి జలాశయం ఎత్తు పెంపు వల్ల మరో 100 టీఎంసీలను కర్ణాటకలో నిల్వచేసుకుంటారని.... అధికారులతో వ్యాఖ్యానించారు. ఇప్పటికే దిగువకు నీళ్లు రాని పరిస్థితి ఉందన్న సీఎం.... సీమ జిల్లాల్లో ప్రజలు తాగునీటికే ఇబ్బందులు పడుతున్నారన్నారు. అన్ని వివరాలు పొందుపరుస్తూ కేంద్ర మంత్రికి లేఖ రాయాలని సీఎం పేర్కొన్నారు.

బచాయవత్‌ ట్రైబ్యునల్‌ ప్రకారం ఏపీకి ఉన్న కేటాయింపుల పరిధిలోనే తాగునీటి సమస్య పరిష్కరించేందుకు.... రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపడుతున్న విషయం కేంద్ర ప్రభుత్వానికి అర్థమయ్యేలా లేఖ ఉండాలని సూచించారు.

ఇదీ చదవండి:

వైద్యారోగ్య శాఖలో ఖాళీల భర్తీకి సీఎం ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.