పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. డిసెంబర్ 25న తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా తొలి విడతలో ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తదుపరి 28న చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఇళ్ల పట్టాల పంపిణీ జరగనుంది. అనంతరం 30వ తేదీన విజయనగరంలో మూడో విడతగా పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మూడు చోట్లా ముఖ్యమంత్రి జగన్ స్వయంగా హాజరై పట్టాలను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలను, టిడ్కో గృహాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పులివెందులకు సీఎం
మరోవైపు ఈ నెల 24న సీఎం జగన్ పులివెందుల పర్యటనకు వెళ్లనున్నారు. స్థానికంగా అపాచీ కంపెనీ, ఆర్టీసీ కాంప్లెక్సు, ఆటోనగర్లకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. 25న కుటుంబసభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అక్కడి నుంచే నేరుగా కాకినాడకు చేరుకుని ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి హాజరవుతారని తెలిసింది.
ఇదీ చదవండి: