గ్రామ, వార్దు సచివాలయ సిబ్బంది కార్యాలయాల్లో నిర్దేశిత సమయంలో అందుబాటులో ఉండాలని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చే అభ్యర్థనలు స్వీకరించేందుకు ప్రతీ రోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉండాలని ఆదేశించింది. సచివాలయ ఉద్యోగులందరికీ రోజుకు రెండుసార్లు బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. ఏప్రిల్ నుంచి బయోమెట్రిక్ ఆధారంగానే జీతాల చెల్లింపు ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇదీ చదవండి: ఈ-వాచ్ యాప్ వాడకంలోకి తేవద్దు: హైకోర్టు