లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో నిత్యావసర వస్తువులైన బియ్యం, కూరగాయలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల ధరలను జిల్లా స్థాయిలో నిర్ధరించాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో మున్సిపల్ కమిషనర్లు, మార్కెటింగ్ శాఖ అదనపు డైరక్టర్, డీఎస్ఓ సహా 10 మంది అధికారుల కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. బీపీటీ రకం బియ్యం, సోనామసూరి, కంది, పెసలు, మినుములు, శనగపప్పులతో పాటు ఉల్లి, టమాట, వంకాయలు, బెండకాయలు, మిరప, బంగాళదుంప తదితర కూరగాయలకు సంబంధించి ధరల నిర్ధరణకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం సూచనలు జారీ చేసింది.
రైతు బజార్ల లోకూరగాయల ధరలు నిత్యం ప్రదర్శించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలిచ్చింది. సరుకులకు సంబంధించిన... ధరలు దుకాణాల వెలుపల ప్రదర్శించేలా చర్యలు చేపట్టాలని పేర్కొంది. ఇక అధిక ధరలకు సంబంధించిన ఫిర్యాదులు 1902 కాల్ సెంటర్కు చేసేలా ప్రచారం చేయాల్సిందిగా ప్రభుత్వం స్పష్టం చేసింది. లాక్ డౌన్ సమయంలో అధిక ధరలకు నిత్యావసరాలు విక్రయిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇవీ చూడండి: