సీపీఎస్ ఉద్యోగులకు పూర్తి స్థాయిలో మేలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్ హామీ ఇచ్చినట్లు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. త్వరలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశం ఏర్పాటు చేసి తమ వైఖరిని చెబుతామన్నారని వివరించారు. సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నేతలతో కలిసి వెంకట్రామిరెడ్డి సోమవారం తాడేపల్లిలో సీఎంను కలిశారు. సీపీఎస్‌ను రద్దు చేయాలని, పాత విధానం అమలుకు స్పష్టమైన తేదీ ప్రకటించాలని కోరినట్లు ఓ ప్రకటనలో తెలిపారు.
ఇదీ చదవండి: నేటి నుంచి విద్యార్థులకు వీడియో పాఠాలు