ETV Bharat / city

నూజివీడు ఎమ్మెల్యేపై కేసు ఉపసంహరణ - ap govt drop criminal case against nuziveedu mla

కృష్ణా జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప్‌ అప్పారావు సహా 14 మంది వైకాపా నాయకులు, కార్యకర్తలపై 2018 అక్టోబరు 25న నమోదైన కేసును ఉపసంహరిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులిచ్చింది.

ap government
ap government
author img

By

Published : Nov 11, 2020, 7:00 AM IST

కృష్ణా జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప్‌ అప్పారావు సహా 14 మంది వైకాపా నాయకులు, కార్యకర్తలపై 2018 అక్టోబరు 25న నమోదైన కేసును ఉపసంహరిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. అప్పట్లో వైకాపా అధ్యక్షుడు జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో ఓ వ్యక్తి దాడి చేయగా అందుకు నిరసనగా నూజివీడులోని సింగ్‌ హోటల్‌ సెంటర్‌లో అప్పారావు తదితరులు ఆందోళనకు దిగారు. వారిపై ఐపీసీ 341, 143 రెడ్‌విత్‌ 149 సెక్షన్ల కింద కేసు నమోదైంది. డీజీపీ విజ్ఞప్తి మేరకు ఆ కేసును ఉపసంహరిస్తున్నట్టు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే విజయవాడలోని మాచవరం స్టేషన్‌ పరిధిలో ప్రస్తుతం పరారీలో ఉన్న ముప్పా దుర్గాప్రసాద్‌పై 2008లో నమోదైన కేసునూ ఉపసంహరించారు.

ప్రొఫెసర్‌ వెంకటరామిరెడ్డిపైనా...
తిరుపతి ఎస్వీయూలో పనిచేసి పదవీ విరమణ పొందిన ప్రొఫెసర్‌ ఎల్లటూరి వెంకటరామిరెడ్డిపై ప్రాసిక్యూషన్‌ను ఉపసంహరించుకోవాలని సీఐడీ అధికారులను ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి కుమార విశ్వజిత్‌ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. గతంలో కడపలోని యోగివేమన విశ్వవిద్యాలయానికి ఓఎస్డీగా పనిచేసినప్పుడు ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారన్నది ఆయనపై ఆరోపణ. ఆయనతో పాటు అప్పటి రిజిస్ట్రార్‌ షేక్‌ హిదయతుల్లా, మధుసూదన్‌, ప్రభాకర్‌రావు, జయరామిరెడ్డిపై సీఐడీ అధికారులు అభియోగాలు నమోదు చేశారు. దీనిపై చిత్తూరులోని నాల్గో అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో విచారణ సాగుతోంది. ఈ ప్రాసిక్యూషన్‌ను ఉపసంహరించుకునేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సీఐడీ అదనపు డీజీని ఆదేశించింది.

ఇదీ చదవండి

స్వగ్రామానికి చేరిన వీరజవాన్ ప్రవీణ్ పార్థివ దేహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.