మూడో దఫా లాక్‌డౌన్ అమల్లో ఉన్న సమయంలో.. ఎల్జీ పాలిమర్స్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు నిరభ్యంతర పత్రం ఇవ్వలేదని.. హైకోర్టుకు ప్రభుత్వం నివేదించింది. నిత్యావసరాల సంబంధిత పరిశ్రమల కోసం మార్చి 24న మార్గదర్శకాలు జారీచేసినప్పటికీ.. ఎల్జీ పాలిమర్స్‌కు అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేసింది. కార్యకలాపాల నిర్వహణకు అనుమతివ్వాలని సంస్థ మెయిల్ చేసిందని ప్రభుత్వం వెల్లడించింది. అయితే... పరిశ్రమ కంటైన్మెంట్, బఫర్ జోన్లో లేదనే డిక్లరేషన్ సమర్పించాలన్న సూచనకు.... సంస్థ నుంచి స్పందన లేదని నివేదించింది. ఇప్పటికే.... సంస్థను సీజ్ చేశామన్న ప్రభుత్వం... డైరెక్టర్ల పాస్ పోర్టులను సైతం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు... తెలిపింది. గ్యాస్ లీక్ వల్ల మేఘాద్రిగడ్డ ప్రభావితమైందన్న వాదన సరికాదని..... ప్రభుత్వం తెలిపింది. నీటిలో స్టైరీన్ నమూనాలు లేవంది
ఇదీ చూడండి: ఎల్జీ పాలిమర్స్ కేసులో ఎన్జీటీ కీలక ఆదేశాలు