రాష్ట్రంలో కరోనా పరీక్షలు చేసేందుకు ప్రైవేట్ ల్యాబ్‌లకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐసీఎంఆర్ అనుమతించిన ల్యాబ్‌ల్లో టెస్టులు చేసేందుకు అనుమతి మంజూరు చేస్తూ ఏపీ వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే ప్రైవేట్ ల్యాబ్‌ల్లో కొవిడ్ టెస్టులకు ధరలను నిర్ణయించింది. ప్రభుత్వం పంపిన నమూనాలకు రూ.2,400 వసూలు చేయాలని సూచించింది.
వ్యక్తిగతంగా సంప్రదిస్తే రూ.2900 వసూలు చేయాలని వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. పరీక్షలు నిర్వహించిన ల్యాబ్‌లు.. ఫలితాల వివరాలు ప్రభుత్వానికి సమర్పించాలని తెలిపింది. ఆర్టీపీసీఆర్ యంత్రాల ద్వారా వచ్చిన ఫలితాలను ఐసీఎంఆర్‌తో పాటు ప్రభుత్వ పోర్టల్‌లో అప్లోడ్ చెయ్యాలని సూచించింది.
ఇదీ చూడండి..