ETV Bharat / city

కార్యకలాపాలను అనుమతించేందుకు నిబంధనలు సిద్ధం! - instructions of covid19

కరోనా నియంత్రణ నేపథ్యంలో వివిధ రంగాల్లో కార్యకలాపాలను అనుమతించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రామాణిక నిర్వహణ విధానాలను సిద్ధం చేసింది. వీటిపై ఇవాళ ఉత్తర్వులు రానున్నాయి.

ap governament
ap governament
author img

By

Published : May 20, 2020, 7:28 AM IST

Updated : May 20, 2020, 10:25 AM IST

రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులలో కరోనా సంబంధిత లక్షణాలతో బాధపడుతున్న వారిని అనుమతించరు. 65 ఏళ్లకు మించిన వారిని, గర్భిణులను ఎక్కించుకోరు. మాస్కుల్లేకపోతే బస్సుల్లో నుంచి దించేస్తారు. పొలం పనులకు వెళ్లే కూలీలు, పరిశ్రమల్లో పని చేసే కార్మికులు గుంపులుగా భోజనం చేయకూడదు. కరోనా నియంత్రణ నేపథ్యంలో వివిధ రంగాల్లో కార్యకలాపాలను అనుమతించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రామాణిక నిర్వహణ విధానాలను సిద్ధం చేసింది. వీటిపై ఇవాళ ఉత్తర్వులు రానున్నాయి.

క్రిమిరహితం తప్పనిసరి

* కార్యాలయాలను రోజూ మూడుసార్లు క్రిమిసంహారకాలతో శుభ్రం చేయాలి
* డోర్‌ హ్యాండిల్స్‌, స్టీరింగ్‌, బల్లలు, కౌంటర్లు, లిప్టులు, కీబోర్డులు తదితరాలు శుభ్రపరచాలి.
* మరుగుదొడ్లు, స్నానపు గదులు, నీటి కుళాయిలను గంటకోసారి శుభ్రం చెయ్యాలి.
* అందరూ తరచూ తాకే ప్రాంతాలకు ఎరుపు రంగు వేయాలి.
* బస్సులు, వాహనాల్ని సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణంతో క్రిమిరహితం చేయాలి.

గుంపుగా భోజనం చేయకూడదు

* 65 ఏళ్లకు మించిన వారు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు, అయిదేళ్లలోపు పిల్లలున్న తల్లిదండ్రుల్ని ఇంటి నుంచే పని చేయించాలి.
* మధ్యాహ్న భోజనం గుంపుగా తినకూడదు.
* క్యాంటీన్లు నిర్వహించకూడదు. ఆహారాన్ని ప్యాక్‌ చేసి అందించాలి.

వీటిలో నగదు రహిత లావాదేవీలే

* మార్కెట్‌ యార్డులు, దుకాణాలు, ఆటోరిక్షాలు, ఆర్టీసీ బస్సులు, క్షౌరశాలలు, హోటళ్లు, రెస్టారెంట్లు.

వ్యవసాయ పరికరాల్ని మరొకరికి ఇవ్వొద్దు

* వ్యవసాయ పరికరాలు, యంత్రాలను మరొకరికి ఇవ్వకూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో మరొకరికి ఇవ్వాల్సి వస్తే క్రిమిరహితం చేయాలి.
* వ్యవసాయోత్పత్తుల అమ్మకాలకు ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాం అందుబాటులోకి తేవాలి.

ఆటోలో ఇద్దరే

* ఆటోలో ఇద్దరినే ఎక్కించుకోవాలి. షేర్‌ ఆటోలు అనుమతించరు. డ్రైవర్‌, ప్రయాణికుల మధ్య ప్లాస్టిక్‌ షీట్‌ ఏర్పాటు చేసుకోవాలి. ఇంటి నుంచి బయల్దేరే ముందు క్రిమినాశనం చేయాలి. హ్యాండ్‌ శానిటైజర్‌ ఉంచాలి.
* ద్విచక్రవాహనాలపై ఒకరికే అనుమతి. భార్యను కూర్చోబెట్టుకోవచ్చు.

65 ఏళ్లు దాటితే బస్సెక్కించుకోరు

* 65 ఏళ్లు దాటిన వారిని, దీర్ఘకాలిక వ్యాధులు, ఇతర సమస్యలున్న వారిని, గర్భిణులు, పదేళ్లలోపు పిల్లలను ప్రయాణానికి అనుమతించరు.
* కరోనా లక్షణాలు లేవని ధ్రువీకరించాకే డ్రైవరును విధుల్లోకి అనుమతిస్తారు. వారానికోసారి పరీక్షలు తప్పనిసరి. లక్షణాలు కన్పిస్తే స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవాలి.
* పొడిదగ్గు, జ్వరం, శ్వాస ఇబ్బందులున్న వారిని బస్సుల్లోకి అనుమతించరు.
* ఏసీ బస్సులు నాన్‌స్టాప్‌ ప్రయాణాలకే పరిమితం.
* టికెట్లు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాలి.
* బస్సుల్ని దారిలో ఉండే దాబాలు, టీ దుకాణాల వద్ద ఆపకూడదు.
* ఒక బ్యాగ్‌ మాత్రమే తీసుకెళ్లాలి.

ఆకర్షణీయ ప్రకటనలకు వీల్లేదు

* ఒకటికి మించి బిల్లింగ్‌ కౌంటర్లు ఏర్పాటు చేసుకోవాలి.
* సాధ్యమైనంత మేర ఏసీలు వినియోగించకూడదు.
* ట్రయల్‌ గదులకు అనుమతి లేదు.
* వినియోగదారుల్ని ఆకర్షించేలా ప్రదర్శనలు, ప్రత్యేక ఆఫర్లు కూడదు.

సెలూన్లలో మసాజ్‌లు లేవు

* సేవలందించే వ్యక్తి మాస్కు, గ్లౌవ్స్‌ ధరించాలి. ప్రతి సేవ తర్వాత గ్లౌవ్స్‌ మార్చాలి.
* ప్రతి వినియోగదారునికి ఒక వస్త్రం మార్చాలి.
* కత్తులు, రేజర్లు, ట్రిమ్మర్లను స్టెరిలైజ్‌/శానిటైజ్‌ చేయాలి. ఎప్పటికప్పుడు సబ్బుతో కడగాలి.
* మసాజ్‌ సేవలు చేయకూడదు.

రెస్టారెంట్లలో తినకూడదు..

* అక్కడే తినకూడదు. ఇంటికి తీసుకెళ్లాలి.
* వంటపనివారు తరచూ శానిటైజ్‌ చేసుకోవాలి.
* ఆన్‌లైన్‌ ఆర్డర్లను ప్రోత్సహించాలి.

ఇదీ చదవండి:

రేపటి నుంచి రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు

Last Updated : May 20, 2020, 10:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.