నీతిఆయోగ్ సలహాదారుడు అవినాష్ మిశ్రాతో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ భేటీ అయ్యారు. నీటి పారుదల ప్రాజెక్టులు, నిధుల అంశాలపై అవినాష్ మిశ్రాతో చర్చించారు. రాయలసీమలో 19 ప్రాజెక్టులను పీఎంకేఎస్‌వై, ఈఆర్‌ఎం కింద చేర్చాలని బుగ్గన కోరారు. ప్రాజెక్టులకు ఆమోదం తెలిపితే 15 లక్షల ఎకరాల స్థిరీకరణ జరుగుతుందని వివరించారు. రాష్ట్రానికి రూ.29వేల కోట్ల సాయం చేయాలని కోరినట్లు ఏపీ భవన్ వర్గాలు వెల్లడించాయి.
బుగ్గన ప్రతిపాదనలకు అవినాష్ మిశ్రా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టుల డీపీఆర్ తయారీకి పలు సూచనలు చేసినట్లు సమాచారం. ప్రతిపాదిత ప్రాజెక్టుల డీపీఆర్‌లు నెల రోజుల్లో కేంద్ర జలసంఘానికి సమర్పించాలని అవినాష్ మిశ్రా సూచించినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: