వచ్చే ఏడాది జనవరి నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్లను జారీ చేయాలని భావిస్తున్న ప్రభుత్వం ప్రస్తుతం వివిశ శాఖల్లో ఖాళీలు గుర్తించే పనిలో పడింది. ఈ అంశంపై సచివాలయంలో వివిధ శాఖల్లో ఖాళీలపై విభాగాధిపతులు, శాఖల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు అందజేయాలని ఆదేశించారు. శాఖల నుంచి పూర్తి స్థాయి సమాచారం వచ్చాక ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్లు జారీ చేసేందుకు క్యాలెండరు విడుదల చేయాలని నిర్ణయించారు. వచ్చే నెలాఖరు నాటికి భర్తీ చేయాల్సిన ఖాళీల వివరాలతో నివేదికలివ్వాలని అధికారులకు సీఎస్ ఆదేశించారు. ఏపీపీఎస్సీ ద్వారా పోస్టుల భర్తీకి కొత్త విధానాన్ని రూపొందించే అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షించారు. ఉద్యోగాల నోటిఫికేషన్ల జారీ సమయంలో వివిధ శాఖల్లోని పోస్టులకు సంబంధించి 267 కేటగిరీలను 6గా కుదించి దానికి అనుగుణంగానే జారీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఇదీ చూడండి: