ETV Bharat / city

కరోనా స్వైరవిహారం... వందలో 17 మందికి పైనే పాజిటివ్​

author img

By

Published : Aug 29, 2020, 6:48 PM IST

Updated : Aug 30, 2020, 4:04 AM IST

ap-corona-updates
కొనసాగుతున్న కొవిడ్ ఉద్ధృతి.. మరో 10,548 కేసులు నమోదు

18:43 August 29

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఎంతకూ అదుపులోకి రావడం లేదు. కొన్ని రోజులుగా నిత్యం నిర్వహిస్తున్న పరీక్షల్లో ప్రతి వందమందిలోనూ కనీసం 17 మందికి పైనే పాజిటివ్ ఉన్నట్లు తేలుతోంది. రాష్ట్రంలో కొత్తగా 10 వేల 548 కేసులు నమోదు కాగా బాధితుల సంఖ్య 4 లక్షల 14 వేల 164కు పెరిగింది.

ap-corona-updates
కరోనా కేసుల వివరాలు

రాష్ట్రంలో కరోనా స్వైరవిహారం కొనసాగుతోంది. రోజూ పరీక్షలు నిర్వహిస్తున్న ప్రతి వందమందిలోనూ 17 కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ తీవ్రత 4 రోజుల నుంచి కొనసాగుతోంది. బుధవారం 17.51 శాతం, గురువారం 17.32 శాతం, శుక్రవారం 17.16 శాతం చొప్పున కేసులు బయటపడ్డాయి. ఒక్కరోజులో కొత్తగా 62 వేల 24 నిర్ధరణ పరీక్షలు నిర్ధరించగా 17 శాతం మందికి కరోనా ఉన్నట్లు నిర్ధరించారు. కొత్తగా 10 వేల 548 కేసుల నమోదుతో బాధితుల సంఖ్య 4 లక్షల 14 వేల 164కు పెరిగింది. ఒక్కరోజులో రికార్డయిన 82 మరణాలతో మొత్తం మృతుల సంఖ్య 3 వేల 796కి చేరింది. 24 గంటల వ్యవధిలో 8 వేల 976 మంది డిశ్చార్జయ్యారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 3 లక్షల 12 వేల 687కి చేరింది. ప్రస్తుతం 97 వేల 681 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 36 లక్షల 3 వేల 345 నిర్ధరణ పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

తూర్పుగోదావరి జిల్లాలో

తూర్పుగోదావరి జిల్లాలో వైరస్ తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 1096 కేసులు నమోదయ్యాయి. కొత్తపేట నియోజకవర్గం పరిధిలో ఒక్కరోజే 128 కేసులు నమోదయ్యాయి. గోపాలపురం పీహెచ్​సీ పరిధిలో 42, ఆత్రేయపురం పరిధిలో 42, కొత్తపేట మండలం అవిడి, వానపల్లి పీహెచ్​సీపరిధిలో 44 మందికి పాజిటివ్ వచ్చింది. జిల్లాలో బాధితుల సంఖ్య 56 వేల 930కి పెరిగింది. కొత్తగా 8 మంది ప్రాణాలు కోల్పోగా.. మృతుల సంఖ్య 378కి చేరింది. ఇప్పటివరకూ 38 వేల 425 మంది డిశ్చార్జయ్యారు. కాకినాడ జీజీహెచ్​లో ఐసీయూ వార్డులను కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి, కాకినాడ ఎంపీ వంగా గీత ప్రారంభించారు.

నెల్లూరు జిల్లాలో

నెల్లూరు జిల్లాలో కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. కొత్తగా వెలుగుచూసిన 1038 కేసులతో బాధితుల సంఖ్య 28 వేల 566కు పెరిగింది. యాక్టివ్ కేసులతో పోలిస్తే డిశ్చార్జైన వారి సంఖ్య మూడురెట్లకు పైగా ఉంది. కొత్తగా 11 మంది ప్రాణాలు విడిచారు. జిల్లాలో వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై  మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఆరా తీశారు. ఆస్పత్రుల్లో పడకలు, వైద్య సిబ్బంది కొరత లేకుండా చూడాలని ఆదేశించారు.

పశ్చిమ, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో

పశ్చిమగోదావరి జిల్లాలో 2 వారాలుగా పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో కేసులు అధికంగా నమోదవుతున్నాయి. జిల్లాలో కొత్తగా 863 కేసులు నమోదా కాగా అందులో అధికంగా పల్లెల్లోనే వెలుగుచూశాయి. మొత్తం బాధితుల సంఖ్య 34 వేల 985కు పెరిగింది. గతంలో నిత్యం ఐదువందలకు పైగా కేసులు ఏలూరులోనే నమోదైతే. ప్రస్తుతం 80 కేసులు నమోదవుతున్నాయి. చిత్తూరు జిల్లాలో కొత్తగా 813 కేసుల నమోదుతో బాధితుల సంఖ్య 34 వేల 765కి పెరిగింది. ఒక్కరోజులో 15 మంది ప్రాణాలు కోల్పోగా మృతుల సంఖ్య 394కి చేరింది. ఇప్పటివరకు 25 వేల 632 మంది కోలుకోగా 8 వేల 739 మంది చికిత్స పొందుతున్నారు. కేసుల ఉద్ధృతితో తిరుపతిలో లాక్‌డౌన్ ఈ నెలాఖరు వరకు పొడిగించారు. శ్రీకాళహస్తి, మదనపల్లె, నగరి, పుత్తూరు పట్టణాలతో పాటు చిత్తూరు నగరంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. కర్నూలు జిల్లాలో కొత్తగా 791 మందికి పాజిటివ్ వచ్చింది. జిల్లాలో కేసుల సంఖ్య 43 వేల 248కు పెరగ్గా 36,031 మంది డిశ్చార్జయ్యారు.

గుంటూరు జిల్లాలో

గుంటూరు జిల్లాలో ఒక్కరోజులో 635 మంది కరోనా సోకినట్లు అధికారులు నిర్ధరించారు. జిల్లాలో కేసుల సంఖ్య 36 వేల 289కు చేరుకుంది. మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 359కి చేరుకుంది. కృష్ణా జిల్లాలో 322 కేసుల నమోదుతో బాధితుల సంఖ్య 15 వేల 742కు పెరిగింది. 2 వేల 385 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నివారణ కోసం.... కేంద్రీయ హోమియోపతి పరిశోధన మండలి ఆధ్వర్యంలో పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నట్లు హోమియోపతి పరిశోధన గుడివాడ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రవీందర్ తెలిపారు. కరోనా సోకిన తెలుగుదేశం ఎమ్మెల్యే బుద్దా వెంకన్నను తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు.

ఇదీ చదవండీ... 'శిరోముండనం ఘటనలో నూతన్​ నాయుడు భార్యపై కేసు నమోదు'

Last Updated : Aug 30, 2020, 4:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.