ETV Bharat / city

దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం - cm jagan inagurated temple managment system

temple managment system
temple managment system
author img

By

Published : Mar 15, 2021, 4:45 PM IST

Updated : Mar 15, 2021, 6:56 PM IST

16:40 March 15

టెంపుల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌

  • క్యాంప్‌ కార్యాలయంలో టెంపుల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ను సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ప్రారంభించారు.
    ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవాలయాల్లో స్వచ్ఛమైన, పారదర్శకమైన వ్యవస్థలు ఉండాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దేవాలయాల్లో అవినీతి లేకుండా చేయడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని తెలిపారు. pic.twitter.com/FZ1noXrYSy

    — CMO Andhra Pradesh (@AndhraPradeshCM) March 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం జగన్.. టెంపుల్ మేనేజ్​మెంట్ సిస్టమ్​ను ప్రారంభించారు. దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాలను టెంపుల్ మేనేజ్​మెంట్ సిస్టమ్ పరిధిలోకి తీసుకొచ్చింది. టెంపుల్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థలో ఆలయాలు, పలు సేవల వివరాలు అందుబాటులో ఉండనున్నాయి. భక్తులు ఈ–హుండీ ద్వారా కానుకలు సమర్పించే అవకాశం ఉంటుంది. క్యూఆర్‌ కోడ్‌ ద్వారా ఈ–హుండీకి కానుకలు సమర్పించవచ్చు.  

తొలిసారిగా అన్నవరం ఆలయంలో ఈ ఆన్‌లైన్‌ పేమెంట్‌ వ్యవస్థను అమల్లోకి తీసుకురానున్నారు. నెలాఖరు నాటికి 11 ప్రధాన ఆలయాల్లో ఈ విధానాన్ని  ప్రవేశపెట్టనున్నారు. ఆలయాల్లో అవినీతి కట్టడికి ఈ వ్యవస్థ ఉపయుక్తమవుతుందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. ఆలయాల్లో స్వచ్ఛమైన, పారదర్శక వ్యవస్థలు ఉండాలని అధికారులను ఆదేశించారు.  

ఇదీ చదవండి

తిరుమల వేద పాఠశాలలో మరో పది మందికి కరోనా

Last Updated : Mar 15, 2021, 6:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.