ETV Bharat / city

CID Case On Siemens: సీమెన్స్‌ ప్రాజెక్టుపై సీఐడీ కేసు

author img

By

Published : Dec 11, 2021, 7:44 AM IST

CID Case On Siemens: గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన సీమెన్స్‌ ప్రాజెక్టుకు సంబంధించి రూ.241 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఫిర్యాదుపై ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ విభాగం కేసు నమోదు చేసింది. నైపుణ్యాభివృద్ధి సంస్థ అప్పటి ఎండీ, సీఈవో గంటా సుబ్బారావు, డైరెక్టర్‌, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ కె.లక్ష్మీనారాయణ, గంటా సుబ్బారావు ఓఎస్డీ నిమ్మగడ్డ వెంకట ప్రసాద్‌తో పాటు పలువురిని నిందితులుగా పేర్కొంది.

ap cid filed case on siemens
సీమెన్స్‌ పై కేసు

CID Filed Case On Siemens: ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన సీమెన్స్‌ ప్రాజెక్టుకు సంబంధించి రూ.241 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఫిర్యాదుపై ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ విభాగం కేసు నమోదు చేసింది. నైపుణ్యాభివృద్ధి సంస్థ అప్పటి ఎండీ, సీఈవో గంటా సుబ్బారావు, డైరెక్టర్‌, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ కె.లక్ష్మీనారాయణ, గంటా సుబ్బారావు ఓఎస్డీ నిమ్మగడ్డ వెంకట ప్రసాద్‌తో పాటు పుణెకు చెందిన డిజైన్‌ టెక్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ముంబయికి చెందిన స్కిలర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, సీమెన్స్‌ ఇండస్ట్రీ సాఫ్ట్‌వేర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ సౌమ్యాద్రి శేఖర్‌ బోస్‌ తదితర 26 మందిని నిందితులుగా పేర్కొంది. ఐపీసీలోని సెక్షన్‌ 166, 167, 418, 420, 465, 468, 471, 409, 201, 109 రెడ్‌విత్‌ 120బీ సెక్షన్లతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని 13(2) రెడ్‌విత్‌ 13(1)(సీ) (డీ) సెక్షన్ల ప్రకారం ఈ కేసు పెట్టింది. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ కె.అజయ్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు.

ఈ ప్రాజెక్టులో అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో వెల్లడైనందున సమగ్ర దర్యాప్తు జరపాలని సీఐడీని కోరుతూ ఈ ఏడాది జులై 11న నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి మెమో జారీచేశారు. వాటి ఆధారంగా ఈ నెల 9న కేసు నమోదు చేసినట్లు సీఐడీ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ఆర్థిక నేరాల విభాగం-2 డీఎస్పీ ఎం.ధనుంజయుడిని దర్యాప్తు అధికారిగా నియమించింది. ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ నుంచి జులై 7న అందిన నివేదిక, ఈ నెల 9న అందిన సీఐడీ ప్రాథమిక విచారణ నివేదిక ఆధారంగా కేసు నమోదు చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో వివరించింది.

ఎఫ్‌ఐఆర్‌లో ఏం ఉందంటే?

పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలపై విద్యార్థులు, యువతకు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా మొత్తం ఆరు నైపుణ్య క్లస్టర్ల ఏర్పాటు కోసం ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీమెన్స్‌ ఇండస్ట్రీ సాఫ్ట్‌వేర్‌ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌, డిజైన్‌ టెక్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లు ఒప్పందం కుదుర్చుకున్నాయి. దాని ప్రకారం ఒక్కో నైపుణ్య క్లస్టర్‌ ఏర్పాటుకు రూ.546.84 కోట్ల వ్యయమవుతుంది. అందులో రూ.491.84 కోట్లు (90%) గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద సీమెన్స్‌ ఇండస్ట్రీ సాఫ్ట్‌వేర్‌ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌, డిజైన్‌ టెక్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లు సమకూరుస్తాయి. రాష్ట్ర వాటా కింద రూ.55 కోట్లు (10%) భరించాలి.

అయితే డిజైన్‌టెక్‌, సీమెన్స్‌ సంస్థలు డొల్ల కంపెనీల ద్వారా నకిలీ ఇన్వాయిస్‌లు సృష్టించి రూ.241.78 కోట్లు కొల్లగొట్టాయి. పుణెలోని జీఎస్టీ నిఘా విభాగం అదనపు డైరెక్టర్‌ జనరల్‌ దర్యాప్తులో ఈ నకిలీ ఇన్వాయిస్‌ల వ్యవహారం వెలుగుచూసింది. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించగా.. 2014-15 నుంచి 2018-19మధ్య ఆర్థిక అవకతవకలు జరిగినట్లు తేల్చింది.

నైపుణ్య క్లస్టర్ల కార్యకలాపాలు, నిర్వహణ బాధ్యతలు చూడాల్సిన సీమెన్స్‌ ఇండస్ట్రీ సాఫ్ట్‌వేర్‌ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌, డిజైన్‌ టెక్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.కోట్ల నిధులను పక్కదారి పట్టించాయి. వారి చర్యలు రాష్ట్ర ఆర్థికవ్యవస్థకు నష్టం కలిగించాయి.

కేసులో నిందితులుగా పేర్కొన్నది వీరినే

  • గంటా సుబ్బారావు, నైపుణ్యాభివృద్ధి సంస్థ మాజీ ప్రత్యేక కార్యదర్శి
  • డాక్టర్‌ కె.లక్ష్మీనారాయణ, నైపుణ్యాభివృద్ధి సంస్థ మాజీ డైరెక్టర్‌
  • నిమ్మగడ్డ వెంకట కృష్ణప్రసాద్‌, గంటా సుబ్బారావు ఓఎస్డీ
  • డిజైన్‌ టెక్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, పుణె
  • స్కిలర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, ముంబయి
  • సౌమ్యాద్రి శేఖర్‌ బోస్‌, ఎండీ, సీమెన్స్‌ ఇండస్ట్రీ సాఫ్ట్‌వేర్‌ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌
  • ప్రతాప్‌ కుమార్‌ కర్‌, చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌, ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి సంస్థ
  • వికాస్‌ వినాయక్‌ ఖన్వేల్కర్‌, సీఎండీ, డిజైన్‌ టెక్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, పుణె
  • సంజయ్‌ దగ, ప్రెసిడెంట్‌, డిజైన్‌ టెక్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, పుణె
  • ముకుల్‌ అగర్వాల్‌, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌, స్కిలర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌
  • సౌరభ్‌ గార్గ్‌, ఎండీ, స్కిలర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌
  • హిరిజి కంజి పటేల్‌, ఎండీ, ఎల్లైడ్‌ కంప్యూటర్స్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌
  • శిరీష్‌ చంద్రకాంత్‌ షా, కీ అడ్మినిస్ట్రేటర్‌, ఎల్లైడ్‌ కంప్యూటర్స్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌
  • నాలెడ్జ్‌ పోడియం సంస్థ డైరెక్టర్లు
  • టాలెంట్‌ ఎడ్జ్‌ సంస్థ డైరెక్టర్లు
  • సురేష్‌ గోయల్‌, దిల్లీ
  • మనోజ్‌కుమార్‌ జైన్‌, దిల్లీ
  • యోగేష్‌ గుప్తా, దిల్లీ
  • సీతారామ్‌ అరోడా, దిల్లీ
  • సౌరభ్‌ గుప్తా, గుర్‌గ్రామ్‌
  • విపిన్‌ శర్మ, దిల్లీ
  • సవాంగ్‌కుమార్‌ తొలరామ్‌ జాజు

ఇదీ చూడండి:

AP CID Raids: మాజీ ఐఏఎస్‌ ఇంట్లో సీఐడీ సోదాలు.. 13న విచారణకు రావాలని నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.