ETV Bharat / city

రైతులకు వైఎస్‌ఆర్‌ అగ్రీలాబ్‌లు.... ప్రజాసేవకులకు వైఎస్‌ఆర్‌ అవార్డులు...

కృష్ణా, గోదావరి కాల్వల శుద్ధి మిషన్ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. అమ్మఒడి పథకం అమలు కోసం నిధుల విడుదలకు అంగీకారం తెలిపింది. గత ప్రభుత్వం కొన్ని సంస్థలకు కేటాయించిన భూములు రద్దు చేసిన మంత్రివర్గం...వివిధ రంగాల్లో సేవలు చేసే వారికి వైఎస్‌ఆర్‌ లైఫ్‌టైమ్ అవార్డులు ప్రదానం చేయాలని నిర్ణయించారు.

cm
author img

By

Published : Oct 30, 2019, 6:34 PM IST

కృష్ణా, గోదావరి కాల్వల శుద్ధి కోసం ప్రత్యేక మిషన్‌

జనవరి నుంచి అమల్లోకి రానున్న "జగనన్న అమ్మఒడి" పథకం అమలుకు ...ఈ ఆర్థిక సంవత్సరంలో 6వేల 455 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అమరావతిలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అర్హులైనవారు తెల్ల రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసి ఉన్నా... అమ్మఒడి వర్తిస్తుందని మంత్రి పేర్ని వెల్లడించారు.

కృష్ణా, గోదావరి కాల్వల శుద్ధి మిషన్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనికి ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. రైతుల్లో సాంకేతిక పరిజ్ఞానం పెంచేందుకు ప్రతి నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌ అగ్రి ల్యాబ్ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆక్వా ల్యాబ్‌ల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.

గతంలో వీబీసీ, లూలూ సంస్థలకు కేటాయించిన భూముల రద్దుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అగ్రిగోల్డ్‌ బాధితులను ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుందని మంత్రి పేర్ని వెల్లడించారు. ప్రజాసేవకు అంకితమైన వారికి వైఎస్ఆర్ లైఫ్‌టైమ్ అవార్డులు ప్రదానం చేస్తామని చెప్పారు.

రాష్ట్రంలోని ఎస్సీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ను 3 కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మాల, మాదిగ, రెల్లితో పాటు ఇతర కులాల కార్పొరేషన్లను వేర్వేరుగా ఏర్పాటు చేసేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని మంత్రి పేర్ని నాని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.