ETV Bharat / city

27న కేబినెట్ భేటీ... అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై చర్చ... - నంబర్ 27న కేబినెట్ మీటింగ్

ఈ నెల 27వ తేదీన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. సచివాలయం మొదటి బ్లాక్​లో సీఎం అధ్యక్షతన మంత్రి వర్గం భేటీ కానుంది. ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో..సమావేశాల నిర్వహణ, సభలో ప్రవేశ పెట్టాల్సిన బిల్లులు తదితర అంశాలపై కేబినెట్​లో చర్చించనున్నారు.

Ap cabinet meeting
Ap cabinet meeting
author img

By

Published : Nov 19, 2020, 6:34 PM IST

Updated : Nov 19, 2020, 7:34 PM IST

ఈ నెల 27వ తేదీన రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది. సచివాలయంలోని మొదటి బ్లాకులో ముఖ్యమంత్రి వైఎస్.జగన్ అధ్యక్షతన మంత్రి వర్గం భేటీ కానుంది. ఈ నెల 30వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, ప్రవేశ పెట్టాల్సిన బిల్లులు తదితర అంశాలపై కేబినెట్​లో చర్చించనున్నారు.

నవంబర్ 30వ తేదీ నుంచి డిసెంబరు 5వ తేదీ వరకు శాసనసభ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. దీనిపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. దిశ బిల్లు సవరణ, అసైన్డ్ భూముల వ్యవహారం తదితర అంశాలు కేబినెట్​లో చర్చ జరిగే అవకాశం ఉంది.

ఇదీ చదవండి : కొత్త జిల్లాల అధ్యయన కమిటీలో డీజీపీకి చోటు

Last Updated : Nov 19, 2020, 7:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.