ETV Bharat / city

జనవరి మూడు తర్వాతే రాజధానిపై తుది నిర్ణయం - bcg ocmmittee on ap captial news

రాజధాని అంశంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయాన్ని తేల్చేందుకు ఇప్పటికే బోస్టన్​ కన్సల్టింగ్​ గ్రూప్ ​(బీసీజీ) నివేదిక రూపొందిస్తోంది. జనవరి 3న  బీసీజీ నివేదిక అందజేయనుంది. అనంతరం జనవరి మూడో వారంలో శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి.. చర్చ అనంతరం.. సభలోనే ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశముంది.

జనవరి మూడో తేదీ తర్వాతే రాజధానిపై తుది నిర్ణయం

author img

By

Published : Dec 28, 2019, 5:00 AM IST

Updated : Dec 28, 2019, 7:58 AM IST

రాజధానిపై మంత్రి వర్గ సమావేశంలో రాని స్పష్టత

రాజధాని తరలింపు అంశంపై మరింత అధ్యయనం చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. జీఎన్ రావు కమిటీ నివేదికపై చర్చించేందుకు ప్రత్యేకంగా సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి మరికొన్ని ఇతర అంశాలపై సైతం చర్చించి నిర్ణయం తీసుకుంది. బోస్టన్​ కన్సల్టింగ్​ కమిటీని ఇప్పటికే ఏర్పాటు చేసిన సర్కారు.. జనవరి 3న నివేదిక అందుకోనుంది. జీఎన్​ రావు కమిటీ నివేదికతో కలిపి ఈ కమిటీ చెప్పిన వివరాలను అధ్యయనం చేసి తుది నిర్ణయం తీసుకోనుంది. ఇందుకోసం మంత్రులు, అధికారులతో హైపవర్​ కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్నినాని వివరించారు. రాజధాని ప్రకటన చేసే ముందు రైతుల అభిప్రాయాలు విన్నాకే నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

కేబినెట్​ నిర్ణయాలివే..

⦁ స్థానిక సంస్థల ఎన్నికల కోసం రిజర్వేషన్ల ఖరారు.. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు మొత్తంగా 59.5 శాతం రిజర్వేషన్లు

⦁ 2020 మార్చి లోగా రూ.130 కోట్లతో కొత్త 108, 104 వాహనాల కొనుగోలుకు కేబినెట్​ ఆమోదం

⦁ రాష్ట్ర వ్యాప్తంగా 341 వ్యవసాయ ఉత్పత్తుల శాశ్వత కొనుగోలు కేంద్రాలను నడపాలని నిర్ణయం

⦁ కనీస మద్దతు ధరకు నోచుకోని పసుపు, ఉల్లి, మిర్చి, చిరు ధాన్యాల కొనుగోలుకు ఆమోదం

⦁ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సీపెట్​కు కృష్ణా జిల్లా సూరంపల్లిలో 6 ఎకరాల భూమిని ఎకరా లక్ష చొప్పున కేటాయించేందుకు నిర్ణయం

⦁ కడప జిల్లా రాయచోటిలో వక్ఫ్​ బోర్డు భవన నిర్మాణానికి అనుమతి

⦁ మచిలీపట్నం, రామాయపట్నం పోర్టు నిర్మాణాలకు సంబంధించిన డీపీఆర్​లను మంత్రివర్గం ర్యాటిఫై చేసింది. రూ.11,900 కోట్ల అంచనాతో బందరు పోర్టు, రూ.10,009 కోట్ల అంచనాతో రామాయపట్నం పోర్టు నిర్మాణానికి కేబినెట్​లో నిర్ణయం తీసుకున్నారు.

అవకతవకలపై విచారణ

తెదేపా హయాంలో రాజధాని వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లుగా మంత్రివర్గం ఉపసంఘం నివేదిక ఇచ్చిందని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఈ విషయంపై సీబీఐ, లేదా లోకాయుక్తతో విచారణ చేయించే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.

భారీ భద్రత

రాజధాని ప్రాంతంలో రైతుల నిరసనల మధ్య నిర్వహించిన రాష్ట్ర కేబినెట్ సమావేశానికి అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేశారు. విజయవాడ నుంచి సచివాలయానికి వెళ్లే మార్గాలన్నింటినీ పోలీసులు మూసివేశారు. ప్రకాశం బ్యారేజీపై వాహన రాకపోకలు నిలిపివేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సచివాలయానికి వచ్చే కాన్వాయ్ మార్గంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సచివాలయం సహా హైకోర్టుకు వెళ్లే ఉద్యోగులను సైతం పోలీసులు అడ్డుకున్నారు.

ఇదీ చూడండి:

'రైతులను సీఎం జగన్ నిలువునా ముంచారు'

Intro:Body:

In the cabinet meeting on Friday, Chief Minister Jagan Mohan Reddy’s government decided to defer the decision on relocating the state capital.

Speaking to media after the Cabinet meeting, Information Minister Perni Venkataramaiah (Nani) said, "Chief Minister YS Jagan Mohan Reddy wanted decentralisation of development and equal representation to all regions. He is committed to the creation of the Legislative capital in Amaravati.”

Conclusion:
Last Updated : Dec 28, 2019, 7:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.