ETV Bharat / city

ఒకరిద్దరికి పదవులిస్తే సాధికారత వచ్చేసినట్లేనా... సామాజిక న్యాయం జరుగుతుందా..? - AP Cabinet issue

Cabinet News: కొన్ని పదవులు ఇస్తాం. ఇక ఆయా వర్గాలకు సాధికారత వచ్చేసినట్లే? ఆ సామాజిక వర్గాలకు సామాజిక న్యాయం జరినట్లే? ఇదీ ప్రభుత్వ పెద్దల వాదన. అయితే... నిధులు, విధులు అధికారాలు లేకుండా... సీఎంఓ డైరెక్షన్‌లో పని చేయడమూ ఓ సాధికారతేనా..? ఇదీ సామాజిక న్యాయమేనా అని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

Cabinet reshuffle
Cabinet reshuffle
author img

By

Published : Apr 11, 2022, 5:56 AM IST

Updated : Apr 11, 2022, 6:45 AM IST

తాజా మంత్రివర్గ కూర్పు మహా సామాజిక విప్లవమని, వెనుకబడిన వర్గాలకు మరీ ముఖ్యంగా బీసీలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చామని, గతంలో ఎప్పుడూ, ఎవరూ ఇంత బ్రహ్మాండంగా చేసిన దాఖలాలు లేవని అధికార వైకాపా వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఆయా వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా పురోగమించేందుకు నిర్మాణాత్మక చర్యలేమీ చేపట్టకుండా, కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చినంత మాత్రాన సామాజిక విప్లవం వచ్చేసినట్లేనా? సాధికారత సాధించేసినట్లేనా? తామంతా అభివృద్ధి చెందినట్లుగా భావించి, ఆయా వర్గాలన్నీ ఆనందోత్సాహాల్లో మునిగితేలాలా? అనే విమర్శలు వినిపిస్తున్నాయి. వివిధ సామాజికవర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు మంత్రిపదవులే గీటురాయి అయితే... ఇప్పుడు మంత్రివర్గంలో పదవులు దక్కని వర్గాల్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించినట్లే భావించాలా? అనే ప్రశ్నలూ విపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. ఇప్పుడు కేబినెట్‌లో చోటు దక్కిన ఇద్దరు బీసీ మహిళా ఎమ్మెల్యేల భర్తలు... ప్రస్తుత మంత్రివర్గ కూర్పులో ప్రాతినిధ్యం లభించిన రెండు అగ్రవర్ణాలకు చెందినవారే కావడం విశేషం. అది కూడా ఒక విధమైన సామాజిక న్యాయమేనా? అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

వారెవరికి స్వతంత్రంగా నిర్ణయాలు స్వేచ్ఛ లేదు..: బొత్స సత్యనారాయణ వంటి సీనియర్లు సహా గత మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించిన మంత్రులెవరికీ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేందుకు, మాట్లాడేందుకు స్వేచ్ఛ లేదు. అందరూ సీఎంఓ డైరెక్షన్‌లో పనిచేయాల్సిందే. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మహిళ సుచరితకు హోం మంత్రి పదవి కేటాయించినా, ఆ శాఖపై పెత్తనమంతా సీఎంఓలోని కొందరు ముఖ్యులదేనన్న విమర్శలు ఉన్నాయి. తన శాఖపై సమీక్షించేందుకు, స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేందుకు ఆమెకు వీసమెత్తయినా అవకాశం లభించలేదు. ఎస్సీలపైనే దాడులు జరుగుతున్నా, వారి పైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నా, విశాఖలో డాక్టర్‌ సుధాకర్‌ నుంచి చీరాలలో కిరణ్‌ వరకు ఎస్సీ వర్గానికి చెందినవారే పోలీసుల దమనకాండకు బలైనా ఆమె కిమ్మనలేకపోయారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అంత కీలకమైన హోం మంత్రి పదవిని ఎస్సీ వర్గానికి చెందిన ఒక మహిళకు కేటాయించామని గొప్పలు చెప్పడానికి తప్ప.. ఆమెకు ఆ పదవి ఇవ్వడం వల్ల ఆ వర్గానికి ఒరిగిందేమీ లేదని విపక్ష నేతలు అంటున్నారు.

ఇదేనా సామాజిక న్యాయం..?: ఇక సాంఘిక, బీసీ, మైనారిటీ సంక్షేమం వంటి శాఖల్ని నిర్వహించిన మంత్రులు కూడా ఆయా వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన సందర్భాలు కానీ, అందుకు వారికి అవకాశాలు కానీ లేవనే చెప్పాలి. పుష్ప శ్రీవాణి, తానేటి వనిత, నారాయణస్వామి, శంకరనారాయణ, జయరాం వంటివారికీ మంత్రి పదవులు అలంకారప్రాయంగానే మిగిలాయి తప్ప... నిజమైన అధికారాల్లేవన్న విమర్శలు ఉన్నాయి. ఎక్సైజ్‌ మంత్రి నారాయణస్వామిది మరీ ఇబ్బందికరమైన పరిస్థితి. పేరుకే ఆయన మంత్రి అని, ఆయన శాఖలోని వ్యవహారాలన్నీ మరో సీనియర్‌ మంత్రి తనయుడే నడిపించేవారని ఎవర్ని అడిగినా చెబుతారు. ఆ మాత్రం దానికి ఆయనకు మంత్రి పదవి ఉంటే ఏంటి? లేకపోతే ఏంటి? ఇదేనా సామాజిక న్యాయం? అని విపక్షాలు విమర్శిస్తున్నాయి. మంత్రివర్గంలోని వెనుకబడిన వర్గాలకు చెందిన మంత్రులకే సాధికారత లేనప్పుడు, సామాజిక సమతూకం, సాధికారత ఇంకెక్కడ సాధ్యమవుతుందని, ఇప్పుడు తాజా కేబినెట్‌లో మంత్రులుగా బాధ్యతలు చేపట్టేవారి పరిస్థితీ అంతకంటే భిన్నంగా ఉండబోదన్న భావన వ్యక్తమవుతోంది.

వారికి ప్రత్యేకంగా ఒరగబెట్టిందేంటి..?: ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లోని పేదలకు గతంలో అమల్లో ఉన్న పెళ్లికానుక, విదేశీ విద్య వంటి పథకాలను, స్వయం ఉపాధి రుణాల్ని నిలిపేయడం, ఆయా వర్గాల్లోని పేదలు తమ కాళ్లపై తాము నిలబడేందుకు ఉన్న అవకాశాలను గండికొట్టడమేనా సాధికారత? అగ్రవర్ణాల్లోని పేదలకు లేనివి, ప్రత్యేకంగా బీసీ, ఎస్సీ వర్గాలకు మాత్రమే రూపొందించిన పథకాలు ఈ ప్రభుత్వ హయాంలో ఏమున్నాయి? అన్ని వర్గాలతో పాటు అమలు చేసే నవరత్నాలు తప్ప.. వారికి ప్రత్యేకంగా ఒరగబెట్టిందేంటి? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వారి అభ్యున్నతికి ప్రత్యేక పథకాలు, కార్యక్రమాలు లేకుండా.. నాలుగు మంత్రి పదవులు ఎక్కువగా ఇచ్చినా ఉపయోగం లేదని, కేవలం పదవులిచ్చి సామాజిక సమతూకం సాధించేశామంటే సరిపోదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, వాటిని రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చారే తప్ప, వాటి వల్ల ఆయా సామాజిక వర్గాలకు ఒరిగిందేమీ లేదని...పైగా బీసీ ఉప ప్రణాళిక నిధుల్ని ఈ కార్పొరేషన్ల ద్వారా నవరత్నాలకు మళ్లించారని ఆరోపిస్తున్నాయి.

ఒక వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే, ఆ వర్గం సామాజికంగా ఉన్నతి సాధిస్తుందా..?: ఎస్సీ కార్పొరేషన్‌ను మూడుగా విడగొట్టారు. కానీ దేనికీ ఒక్క రూపాయి నిధులు ప్రత్యేకంగా కేటాయించలేదు. దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ప్రధాన లక్ష్యం పేదలకు ఉపాధి అవకాశాలు కల్పించి, వారి స్వయం ఉపాధికి రుణాలిచ్చి, వారి కాళ్ల మీద వారు నిలదొక్కుకునేలా చేయడం. అలాంటి కార్పొరేషన్లను, వాటి లక్ష్యాన్ని వైకాపా ప్రభుత్వం గత మూడేళ్లలో పూర్తిగా నీరుగార్చిందన్న విమర్శలు ఉన్నాయి. ఆయా వర్గాలకు చెందిన పేదలకు చేయూతనిచ్చే కార్యక్రమాల్ని తుంగలో తొక్కి.. ఒక వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే, ఆ వర్గం సామాజికంగా ఉన్నతి సాధిస్తుందా? మహా అయితే మంత్రి పదవి పొందిన వ్యక్తి కుటుంబం, ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే కొందరు సామాజికంగా వృద్ధి సాధిస్తారేమో తప్ప, ఆ వర్గంలోని ప్రజలకు ఒరిగేదేంటి? అన్న విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వాల హయాంలో అమల్లో ఉన్న, ఈ ప్రభుత్వం వచ్చాక నిలిపివేసిన కొన్ని పథకాల్ని పునరుద్ధరించాలని ఆయా సంక్షేమ శాఖల మంత్రులకు మూడేళ్లలో ఎన్ని విజ్ఞప్తులు వచ్చినా బుట్టదాఖలయ్యాయే తప్ప, వాటిని కనీసం ముఖ్యమంత్రి దగ్గర ప్రస్తావించే సాహసం చేయలేకపోయారన్న అభిప్రాయం ఉంది.

ఇదీ చదవండి: నేడు కొలువుదీరనున్న కొత్త మంత్రివర్గం... పాతవారిలో 11 మందికి మళ్లీ అవకాశం

Last Updated : Apr 11, 2022, 6:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.