ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో శుక్రవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పౌరసరఫరాల కార్పొరేషన్ ద్వారా ఐదు వేల కోట్ల రూపాయల రుణ సమీకరణకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. అలాగే రాష్ట్రంలో నూతన పర్యాటక విధానానికి పచ్చజెండా ఊపింది.
మంత్రివర్గం ఆమోదించిన మరికొన్ని అంశాలు
- రాష్ట్రంలో వైద్య విద్య & పరిశోధన కార్పొరేషన్ ఏర్పాటు
- సర్వే, బౌండరీ చట్ట సవరణ
- తిరుపతిలో ల్యాండ్ సర్వే అకాడమీ ఏర్పాటు, దీనికి 40 ఎకరాల భూ కేటాయింపు
- ఏపీ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఉద్యోగులకు వీఆర్ఎస్
- ప్రతి నియోజకవర్గంలో పశువుల రోగ నిర్ధరణ కేంద్రాల ఏర్పాటు
సీఎస్‌కు సత్కారం
మరోవైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఈ నెలాఖరుకి పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో మంత్రి మండలి సీఎస్‌ను సత్కరించింది.
ఇదీ చదవండి