ETV Bharat / city

బిల్డ్ ఏపీ... ముసాయిదా మార్గదర్శకాలు విడుదల

నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి... బిల్డ్ ఆంధ్రప్రదేశ్ మిషన్ ద్వారా విక్రయించాలని జగన్ సర్కారు నిర్ణయించింది. నవరత్నాలతో పాటు... విద్య, వైద్య విభాగాల్లో అభివృద్ధి కార్యక్రమాల అమలు కోసం... ఈ నిధులు వినియోగించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి ముసాయిదా మార్గదర్శకాలు విడుదల చేసింది.

బిల్డ్ ఏపీ... ముసాయిదా మార్గదర్శకాలు విడుదల
author img

By

Published : Nov 6, 2019, 6:46 AM IST

బిల్డ్ ఏపీ... ముసాయిదా మార్గదర్శకాలు విడుదల

రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం ప్రభుత్వం నిధుల వేట చేపట్టింది. ఇందుకోసం... బిల్డ్ ఆంధ్రప్రదేశ్ మిషన్‌ను రూపొందించింది. ఇటీవల నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో బిల్డ్ ఏపీ మిషన్‌ను ఆమోదించింది. ఈ మిషన్ ద్వారా... రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా, నిరుపయోగంగా ఉన్న భూములను గుర్తించి విక్రయించనున్నారు. ఈ మేరకు కేంద్ర సంస్థ అయిన... నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్​తో త్వరలోనే ఎంవోయూ కుదుర్చుకోనుంది.

ప్రభుత్వం తరపున అవగాహన ఒప్పందం కుదుర్చుకునేందుకు... బిల్డ్ ఏపీ మిషన్ డైరెక్టర్ ప్రవీణ్​కుమార్‌కు అనుమతి ఇస్తూ... ఆదేశాలు జారీ అయ్యాయి. ఎన్‌బీసీసీతో ముసాయిదా ఒప్పందాన్ని ఆమోదిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎన్‌బీసీసీతో ఒప్పందం ద్వారా... రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూముల్లో రహదారి, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. అనంతరం వాటిని విక్రయించి నిధులు సమీకరించనున్నారు. ఆ నిధులను... నవరత్నాలు, నాడు-నేడు అమలు, మౌలిక వసతుల కల్పనకు సర్కారు వినియోగించనుంది.

భూముల విక్రయం ద్వారా వచ్చిన నిధులతోనే... జిల్లా, మండల, గ్రామ సచివాలయాల కాంప్లెక్స్​ల నిర్మాణం చేసేందుకు కార్యాచరణ చేపట్టనున్నారు. విద్య, వైద్య సదుపాయాల కల్పనలో నిధుల సమీకరణకూ బిల్డ్ ఏపీ మిషన్ ప్రణాళిక చేపట్టనుంది. బిల్డ్ ఏపీ మిషన్ ఉత్తర్వులకు అనుగుణంగా అన్ని శాఖలు, సంస్థలు, విశ్వవిద్యాలయాల పరిధిలోని భూములను... జిల్లా ప్రణాళికా అమలు సంఘం పరిధిలోకి తేవాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. భూముల యాజమాన్య హక్కులు జిల్లా ప్రణాళిక సంఘానికి... బదలాయించేలా నిబంధనలు మార్చాలని జీవోలో స్పష్టం చేసింది. భూముల వివరాలను ఎన్‌బీసీసీకీ అందచేయాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

ఇదీ చదవండీ... రాష్ట్రంలో సీబీఐ సోదాలు... ఎక్కడెక్కడ..?

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.