ETV Bharat / city

ఆనందయ్య మందుతో కొవిడ్‌ తగ్గిందనేందుకు ఆధారం లభించలేదు: ఆయుష్‌ కమిషనర్‌ - ap govt green signal to anadaiah medicine

anadaiah medicine
ayush commissioner ramulu
author img

By

Published : May 31, 2021, 5:32 PM IST

Updated : May 31, 2021, 6:38 PM IST

17:27 May 31

Anadaiah Medicine తోసైడ్‌ ఎఫెక్ట్స్‌ లేవు: ఆయుష్‌ కమిషనర్‌

ఆయుష్‌ కమిషనర్‌

ఆనందయ్య ఔషధం (anadaiah medicine) వల్ల కొవిడ్‌ తగ్గిందనేందుకు ఆధారం లభించలేదని రాష్ట్ర ఆయుష్ కమిషనర్ రాములు (ayush commissioner ramulu) స్పష్టం చేశారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి సింఘాల్​తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. పలు ఆసక్తికర విషయాలను ప్రస్తావించారు. ఆనందయ్య ఔషధం వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ (side effects) , నష్టం జరిగిందనేందుకు ఆధారాలు లేవన్నారు. కంటి చుక్కల మందు వల్ల హాని జరగదనేందుకు కూడా ఆధారాలు లేవని తెలిపారు. పూర్తి ఆధారాలకు 3 వారాల సమయం పట్టవచ్చని చెప్పారు.  ఔషధంలో 90-95 శాతం పీ, ఎల్‌, ఎఫ్‌ రకాలు వినియోగించవచ్చని పేర్కొన్నారు. ఔషధంతో పాటు కొవిడ్‌ ప్రొటోకాల్‌ (covid protocol) పాటించాలని సీఎం జగన్ (cm jagan) ఆదేశించారని వివరించారు.

'ఆనందయ్య ఔషధం.. ఆయుర్వేద ఔషధం కాదు. ఔషధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉంది. ఎక్కువ మంది ప్రజలకు లబ్ధి కలుగుతుందని నమ్ముతున్నాం.  గురువారం కోర్టు వెల్లడించిన నిర్ణయం ఆధారంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఔషధం విషయమై విధివిధానాలు ఖరారు చేయాల్సి ఉంది. ఆనందయ్య ఔషధంపై చర్చలు జరిపిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటాం.   ఆనందయ్య ఔషధాన్ని ప్రభుత్వం ఆయుర్వేద ఔషధంగా గుర్తించట్లేదు' - రాములు, రాష్ట్ర ఆయుష్ కమిషనర్

ఈ నెల 21, 22 తేదీల్లో ఆయుష్‌ బృందం కృష్ణపట్నం (krishnapatnam) వెళ్లిందని రాములు తెలిపారు. ఔషధ నమూనాలు ల్యాబ్‌లకు పంపి పరీక్షించామని.. ఇందుకు కేంద్ర పరిశోధన సంస్థ సహకారం తీసుకున్నామన్నారు.  నిపుణుల కమిటీ అభిప్రాయాలను ప్రభుత్వానికి సమర్పించామని పేర్కొన్నారు. ఆనందయ్య ఔషధంలో పీ, ఎల్‌, ఎఫ్‌, కే, కంటి చుక్కల మందు ఉన్నాయని.. 'కె' రకం నమూనాలను మాత్రం నిర్వాహకులు అందివ్వలేదని చెప్పారు.

ఇదీ చదవండి

Anandayya Medicine: ఆనందయ్య మందు పంపిణీకి హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

Last Updated : May 31, 2021, 6:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.