ఎన్‌ఆర్సీ, ఎన్పీఆర్‌తో ముస్లింలు అభద్రతాభావంతో ఉన్నారని.. మంత్రి అంజాద్ భాషా అన్నారు. అందుకే రాష్ట్రంలో ఎన్‌ఆర్సీ అమలు చేయబోమని సీఎం ప్రకటించారు. 2010, 2015లో ఎన్పీఆర్ జరిగిందని, ప్రస్తుత ఎన్పీఆర్‌లో తల్లిదండ్రుల పుట్టిన స్థలం, తేదీ, మాతృభాష తదితరాలపై అభ్యంతరాలున్నాయి. 2010 నాటి ఫార్మాట్ ప్రకారం దాన్ని అమలుచేయాలని కేంద్రాన్ని కోరుతున్నాం. అప్పటివరకు దీన్ని ఆపాలి’ అని కోరారు. ఈ మేరకు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది.
* ‘మైనారిటీలు ఎన్‌ఆర్‌సీపై అభద్రతాభావంతో ఉన్నారని సీఎం జగన్ దృష్టికి రాగానే ఏపీలో దాన్ని అమలు చేయబోమని చెప్పారు. ఇప్పుడు మాట నిలబెట్టుకుని ముస్లింల్లో అభద్రతాభావాన్ని పోగొట్టారు’ అని కర్నూలు, నంద్యాల, ఆళ్లగడ్డ ఎమ్మెల్యేలు హఫీజ్‌ఖాన్, శిల్పా, గంగుల బ్రిజేంద్రరెడ్డి అన్నారు.
- చేపల పెంపకం అభివృద్ధికి సంస్థ
ఏపీ రాష్ట్ర చేపల పెంపకపు అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏర్పాటు బిల్లును పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణరావు ప్రవేశపెట్టారు. 8 మేజర్ షిప్పింగ్ హార్బర్లు ఏర్పాట్లుచేస్తున్నట్లు తెలిపారు. ఈ బిల్లును శాసనసభ ఆమోదించింది.
- 15 బిల్లుల ఆమోదం
రెండు రోజుల్లో 5 గంటల 58 నిమిషాల పాటు సభ జరిగినట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. 15 బిల్లులు ఆమోదం పొందాయని, ప్రభుత్వం 2 తీర్మానాలు ప్రవేశపెట్టిందని చెప్పారు. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభమవగా, 9.30కి టీ విరామం ప్రకటించారు. మళ్లీ సభ 5.30 గంటల తర్వాత.. మధ్యాహ్నం 3 గంటలకు మొదలైంది. 3.40కి నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు సభాపతి ప్రకటించారు.
- అమరవీరులకు సంతాపం
భారత, చైనా సరిహద్దు ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన 20 మంది వీర సైనికులకు శాసనసభ నివాళులు అర్పించింది. సీఎం జగన్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారి కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నానని, కర్నల్ సంతోష్‌బాబు త్యాగం ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. రెండు నిమిషాలపాటు సభ్యులంతా మౌనం పాటించారు. అంతకుముందు ఉదయం పలువురు మాజీ ఎమ్మెల్యేల మృతికి సంతాపం తెలిపారు.
ఇదీ చదవండి: మాటల యుద్ధం.. సభ్యుల బాహాబాహీ.. వెరసి మండలి వాయిదా..!