అక్టోబర్ రెండో వారంలో శాసనసభ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తమౌతోంది. కరోనా కారణంగా 3 రోజులు మాత్రమే సమావేశాలు నిర్వహించే అంశంపై ఆలోచన చేస్తోంది. వచ్చే నెల ఒకటో తేదీన జరగనున్న మంత్రి వర్గ సమావేశంలో అసెంబ్లీ నిర్వహణపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. అక్టోబర్ 12, 13, 14 తేదీల్లో శాసనసభ నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండి : కదులుతున్న కంటైనర్లే టార్గెట్.. రెక్కీ చేస్తే పనైపోయినట్టే!