Bopparaju on Outsourcing Employees: ప్రభుత్వ మెప్పు కోసం అధికారులు ఇచ్చిన పీఆర్సీ నివేదిక ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని ఏపీ అమరావతి ఐకాస అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన ఏపీ కాంట్రాక్టు అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ విజయవాడ ఐకాస సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
AP Outsourcing Employees problems: ‘ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో లక్ష మంది వరకు ఆప్కోస్ కిందకు రాలేదు. ఉద్యోగులు ఏజెన్సీల దోపిడీకి గురవుతున్నారు. వీరికి ఈఎస్‌ఐ, ఈపీఎఫ్ వంటివి అమలు కావడం లేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అందడం లేదు. ఒకరికి ఇచ్చే జీతంతో ఇద్దరిని నియమించుకుని పని చేయించుకుంటున్నారు. కొందరు అధికారులు వారి సొంత పనులు చేయడం లేదని సిబ్బందిని తీసేస్తున్నారు' అని పేర్కొన్నారు. సమావేశంలో ఏపీ ఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, ఉద్యోగుల ఐకాస నాయకులు స్వామి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పీఆర్సీ అమలు నాటికి ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగి అని డేటా ఉండటంతో వారికి సంక్షేమ పథకాలు వర్తించడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే అన్ని ప్రోత్సాహకాలను ఔట్సోర్సింగ్ ఉద్యోగులకూ అందజేయాలి. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి. వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు ఉద్యోగులు అత్యంత దయనీయస్థితిలో పని చేస్తున్నారు. జీవో 40 ప్రకారం టైం స్కేల్ ఎక్కడా అమలు కావడం లేదు. - బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ అమరావతి ఐకాస అధ్యక్షుడు
ఇదీ చదవండి: