అమరావతిలో ఆగిన మరో రైతు గుండె - మూడు రాజధానులపై వార్తలు
అమరావతి ఆందోళనలో మరో రైతు గుండె ఆగింది. రాయపూడికి చెందిన రైతు తోట రాంబాబు గుండెపోటుతో చనిపోయారు. రాజధాని కోసం రాంబాబు ఎకరన్నర పొలం ఇచ్చాడు. రాజధానిని ఇక్కడి నుంచి తరలించవద్దంటూ గత కొన్ని రోజులుగా రైతులు చేస్తోన్న ఆందోళనలో పాల్గొంటున్నారు. రాజధాని తరలిపోతుందనే బాధతోనే ఆయన గుండెపోటుకు గురయ్యారని బంధువులు చెబుతున్నారు.