ETV Bharat / city

ఒక్కపైసా ఇవ్వొద్దు.. సీఎంకు ఫిర్యాదు చేద్దాం: అన్నెం - కోనరఘుపతిపై అవినీతి ఆరోపణలు

Annem Satish Corruption Allegations: బాపట్ల నియోజకవర్గంలో అరాచక పాలన నడుస్తోందని.. కోన రఘుపతి, స్థానిక అధికారులు ప్రజల్ని బెదిరిస్తున్నారని భాజపా మాజీ ఎమ్మెల్సీ అన్నెం సతీశ్ ఆరోపించారు. నియోజకవర్గంలో ఇల్లు కట్టుకోవాలంటే లంచం కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

అన్నెం సతీశ్
అన్నెం సతీశ్
author img

By

Published : Aug 7, 2022, 6:14 PM IST

ఏ ఒక్కరికీ ఒక్కపైసా ఇవ్వొద్దు

Corruption Allegations On Deputy Speaker: బాపట్ల నియోజకవర్గంలో అరాచక పాలన నడుస్తోందని.. భాజపా మాజీ ఎమ్మెల్సీ అన్నెం సతీష్‌ ప్రభాకర్‌ ఆరోపించారు. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, స్థానిక అధికారులు కలిసి ప్రజలను.. వ్యాపారులను బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇల్లు కట్టుకోవాలంటే.. లంచం కట్టాల్సిన పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు. బాపట్ల వాసులు సౌమ్యులన్న ఆయన.. వారిని బెదిరించటం దారుణమని.. ప్రజలకు అండగా ఉంటామని అన్నారు.

ఇకపై ఏ ఒక్కరికీ ఒక్కపైసా కూడా ఇవ్వొద్దని.. ఎవరైనా బెదిరిస్తే తాను అడ్డుగా నిలబడతానని అన్నెం సతీశ్ ప్రకటించారు. బాధితులు తనను స్పందిస్తే ఏసీబీని ఆశ్రయిద్దామని.., అవసరమైతే ముఖ్యమంత్రి జగన్​ను కలసి ఫిర్యాదు చేద్దామని తెలిపారు.

ఇవీ చూడండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.