రాష్ట్ర లోకాయుక్తగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన పక్షం రోజుల్లోనే 448 ఫిర్యాదులు అందాయి. వాటిలో 50 ఫిర్యాదులను తిరస్కరించారు. 215 ఫిర్యాదులను సంబంధిత శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు పంపారు. 183 ఫిర్యాదులకు సంబంధించి ప్రాధాన్యత క్రమంలో తీసుకొని వాటిపై చర్యలకు సంబంధిత శాఖలకు పంపారు.
పాలనా యంత్రాంగం, అధికారుల్లో జవాబుదారీతనం, పరిపాలనలో పారదర్శకతను పెంపొందించేందుకు లోకాయుక్తను ఏర్పాటు చేశారు. గత నెల 15వ తేదీన జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. లోకాయుక్తకు మొదటగా విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులోని రోడ్లు భవనాల శాఖాధిపతి కార్యాలయం కేటాయించారు. అయితే దాని నిర్మాణం పూర్తికాని కారణంగా... ప్రస్తుతం హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోనే విధులు నిర్వర్తిస్తోంది.
ఇవీ చూడండి-తన చిట్టితల్లి కోసం... ఓ అమ్మ పడే ఆరాటం!