ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...7 వేల 361 కోట్ల విదేశీ రుణాలను ఉపయోగించుకున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఏపీకి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ కింద 2015-16 నుంచి 2018-19 వరకూ తీసుకున్న విదేశీ రుణాలపై వడ్డీ చెల్లింపుల కోసం 15.18 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. లోక్‌సభలో కాకినాడ ఎంపీ వంగా గీత అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు.
ఇదీ చదవండి : "జనవరి 1 నుంచి పూర్తిస్థాయిలో సచివాలయ వ్యవస్థ"