అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 18 నుంచి శాసనపరిషత్ సమావేశాలు ప్రారంభం అవుతాయని పేర్కొంటూ ప్రకటన విడుదల చేశారు. 18వ తేదీ ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసన మండలి ప్రారంభం అవుతాయని ఉత్తర్వుల్లో చెప్పారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు జరుగనున్న బీఏసీ సమావేశంలో శాసనసభ, శాసనమండలి పనిదినాలు, అజెండా ఖరారు చేయనున్నారు. అయితే నాలుగు రోజుల పాటు శాసన సభ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదీచదవండి.